S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

విజయవాడ, నవంబర్ 18: నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా టిడిపి ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని, తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఎఐటియుసి ఎపి రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి సీతారామపురంలోని లేబర్ కమిషనర్ కార్యాలయం వరకు మున్సిపల్, హమాలీ, భవన నిర్మాణ, అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన వేలాది మంది కార్మికులతో ప్రదర్శన జరిగింది. అనంతరం లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద మహాధర్నా జరిగింది. కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, దారి మళ్ళించిన 600 కోట్ల భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులను తిరిగి బోర్డుకు జమ చేయాలని కార్మికులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని రామారావు అధ్యక్షతన జరిగిన సభలో ఓబులేసు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు పెంచకుండా ప్రభుత్వం వారితో వెట్టి చాకిరీ చేయించుకుంటోందన్నారు. రాష్ట్రంలో సుమారు కోటి 50 లక్షల మంది కార్మికులు 63 షెడ్యూల్స్ కింద ఉన్న అనేక రంగాల్లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారని, వీరందరికి గత 8,10 సంవత్సరాల క్రితం నిర్ణయించిన వేతనాలే ఇప్పటికీ ఇస్తున్నారని కనీస వేతన చట్ట ప్రకారం రెండు సంవత్సరాలకు ఒకసారి వేతనాలు సవరించి ఇప్పించవల్సి ఉన్నా అమలుకు నోచుకోవడం లేదన్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు లక్షల రూపాయలు వేతనాలు పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనం ఇచ్చేందుకు మీనమేషాలు లెక్కించడం అన్యాయమన్నారు. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు రూ.18 వేలు కనీస వేతనాన్ని తక్షణమే ప్రభుత్వం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయే కాని ఇంతవరకు కనీస వేతన సలహా మండలి, కాంట్రాక్ట్ లేబర్ సలహా మండలి ఏర్పాటు జరగలేదని, ఇటీవల కనీస వేతనాల సలహా మండలి ఏర్పాటు చేసినా ఇంతవరకు దానికి చైర్మన్‌ను నియమించకుండా టిడిపి ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికైనా కార్మిక సమస్యలపై చర్చించేందుకు వారం రోజుల్లో కార్మిక సంఘాల నేతలతో కార్మిక శాఖ మంత్రి, సంబంధిత అధికారులను సమావేశపర్చాలని లేనిపక్షంలో ఇతర కార్మిక సంఘాలన్నింటిని కలుపుకుని ఐక్యకార్యాచరణ రూపొందించి సమస్యలు పరిష్కారానికి ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని ఓబులేసు హెచ్చరించారు. ఎఐటియుసి ఉపప్రధాన కార్యదర్శి ఆర్.రవీంధ్రనాద్ మాట్లాడుతూ 1961 బోనస్ యాక్టుకు 2016 జనవరిలో చేసిన సవరణల ప్రకారం రూ.3,500 నుండి రూ.7 వేలకు పెంచిన బోనస్‌ను 2014 నుంచి ఇవ్వాలన్నారు. మున్సిపల్ కార్మికులకు జివో నెం.151ను అమలు చేయాలని, అన్నిరకాల అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కమిషనర్ వరప్రసాద్‌కు ఎఐటియుసి రాష్ట్ర నాయకత్వం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. దీనిపై ఆయన స్పందిస్తూ కార్మికుల ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మహాధర్నాలో ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శులు ఎస్.వెంకట సుబ్బయ్య, మనోహర్ మాణిక్యం, వి.రాధాకృష్ణమూర్తి, పడాల రమణ, కెఎస్ రావు, కె.లలిత, కె.్భగ్యలక్ష్మి, నాయకులు పల్లా సూర్యరావు, నాగేశ్వరరావు, ఆసుల రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.