S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దేవాలయాల్లో కూచిపూడి నృత్య ప్రదర్శనలు

కూచిపూడి, నవంబర్ 18: భారత, భాగవత పురాణాలలోని అంశాలను ప్రదర్శించి భక్తులను పరవశింప చేసే కూచిపూడి నాట్యాన్ని దేవాలయాలలో నిర్వహించే ఉత్సవాలలో ప్రదర్శింప చేసేందుకు కృషి చేస్తానని దేవాదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ పేర్కొన్నారు. అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి, కూచిపూడి ఆర్ట్ అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక శ్రీ సిద్ధేంద్రయోగి నాట్య కళావేదికపై ఏర్పాటు చేసిన కలాపోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మశ్రీ గొరిపర్తి నరసింహరాజు యాదవ్, మాజీ సర్పంచ్ వైకెడి ప్రసాదరావు, నాట్యాచార్య వేదాంతం రాధేశ్యాం తదితరులు పాల్గొన్నారు. అంతకుముందుగా పద్మశ్రీ డా. వేదాంతం సత్యనారాయణ శర్మ, వేదాంతం పార్వతీశం చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ పంచాంగ కర్త దీవి రామకృష్ణమాచార్యులు రచించిన శ్రీ సంతాన వేణుగోపాల పూజా గ్రంథాన్ని అతిథులు ఆవిష్కరించారు. అతిథులు, కళాకారులను కళామండలి కార్యదర్శి కెశవప్రసాద్ దుశ్శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు.