S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

చల్లపల్లి, నవంబర్ 18: చల్లపల్లి, కంచికచర్ల మండలాల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందిన సంఘటనలు శుక్రవారం జరిగాయ. చల్లపల్లి మండలం వెలివోలు గ్రామంలో కృష్ణా కరకట్టపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం అవనిగడ్డకు చెందిన ఓలేటి వెంకటేశ్వరరావు (24) విజయవాడలోని ఓ ఫార్మా కంపెనీలో రిప్రజెంటివ్‌గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి అవనిగడ్డ ఇంటికి వస్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పిన వెంకటేశ్వరరావు కరకట్టపై వెలివోలు వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో వెంకటేశ్వరరావు మృతి చెందాడు. కరకట్టపై రోడ్డు ప్రమాదంలో మృతి చెంది వెంకటేశ్వరరావు మృతదేహాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. చల్లపల్లి ఎస్‌ఐ డి చంద్రశేఖర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతుని జేబులోని ఐడెంటి కార్డులు ఆధారంగా అవనిగడ్డకు చెందిన ఓలేటి వెంకటేశ్వరరావుగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంకటేశ్వరరావు మృతి సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడకు వచ్చి రోదిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. విఆర్‌ఓ భాషా శవ పంచనామ నిర్వహించగా మృతుని తండ్రి నాగేంద్రం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపంచనామ కోసం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
గాయపడిన తెదేపా సీనియర్ నేత మృతి
కంచికచర్ల: మండలంలోని గొట్టుముక్కలకు చెందిన తెలుగుదేశం సీనియర్ నేత చాగంటి ప్రభాకరరావు (60) శుక్రవారం ఉదయం విజయవాడ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గురువారం సాయంత్రం తన కుమార్తెను టివిఎస్ ఎక్సెల్ వాహనంపై చెవిటికల్లు వద్ద దింపి తిరిగి వస్తుండగా కంచికచర్ల ఊరు ముందు బైపాస్ రోడ్డు సమీపంలో ఎదురుగా వస్తున్న మరో టివిఎస్ ఎక్స్‌ల్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయనను హుటాహుటీన విజయవాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం ప్రభాకరరావు మృతదేహాన్ని స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జడ్‌పిటిసి కోగంటి బాబు, ఎంపిపి వేల్పుల ప్రశాంతి, మార్కెట్ యార్డ్ చైర్మన్ నన్నపనేని లక్ష్మీనారాయణ, జిల్లా తెదేపా ఉపాధ్యక్షుడు నన్నపనేని నర్శింహారావు, మండలంలోని పలువురు నాయకులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.