S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

డ్వాక్రా రుణమాఫీకి కట్టుబడిన ప్రభుత్వం

కైకలూరు, నవంబర్ 18: రాష్ట్రంలో డ్వాక్రా మహిళల రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రెండో విడత మాఫీ చెల్లిస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, వైద్య విద్యా శాఖ మంత్రి డా కామినేని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కైకలూరు నియోజకవర్గంలో డ్వాక్రా మహిళా సంఘాలకు ప్రభుత్వం ద్వారా వచ్చిన రుణమాఫీ పత్రాలను అందించడానికి స్థానిక ఎంపియుపి స్కూల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో మహిళల అభ్యున్నతి గూర్చి తపన చెంది డ్వాక్రా గ్రూపుల ఏర్పాటు చేసి వారి స్వావలంభన పెంచిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు. రెండో విడత రుణమాఫీ కింద రూ. 15.48 కోట్లను డ్వాక్రా సంఘాల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. త్వరలో కొల్లేరు ప్రాంత ప్రజల ఆకాంక్ష అయిన బ్రిడ్జీ నిర్మాణం ఒక నెలలోగా చేపడుతామని, కొల్లేరులో ఉప్పునీరు రాకుండా రెగ్యులేటర్‌ను కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రజల అవసరాలను తీర్చడానికి సిఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. పెద్దనోట్ల రద్దు విషయంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నారని, అయితే రాబోయే కాలంలో చిన్న నోట్ల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆయన అన్నారు. ఏలూరు పార్లమెంట్ సభ్యులు మాగంటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మంత్రి కామినేని శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేల సహాయ సహకారాలతో ఈ ప్రాంతవాసులకు చిరకాల వాంఛనను త్వరలో తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌చార్జి జయమంగళ వెంకటరమణ చంద్రన్న బీమా పథకంపై విఫులీకరించారు. ఈ కార్యక్రమంలో కైకలూరు, మండవల్లి ఎంపిపిలు బండి సత్యవతి, సాకా జసింత, జడ్పేటిసి బొమ్మనబోయిన విజయలక్ష్మి, వైస్ ఎంపిపి ఎంఏ రహీం, రాష్ట్ర బిసి కార్పొరేషన్ డైరెక్టర్ బొల్లా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.