S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వినియోగిస్తారా? వెనక్కి పంపిస్తారా?

విజయనగరం (్ఫర్టు), నవంబర్ 18: మున్సిపాలిటీలో 13వ ఆర్ధిక సంఘం నిధుల వినియోగంపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విడుదలైన నిధుల వినియోగానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ పాలకవర్గం బ్రేక్‌లు వేసింది. పనులు చేపట్టేందుకు మున్సిపల్ ఇంజనీరింగ్ యంత్రాంగం రూపొందించిన వార్షిక అభివృద్ధి ప్రణాళిక(ఎడిపి)ను రెండేళ్ల క్రితం మున్సిపల్ పాలకవర్గం నిలుపుదల చేయడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఈ నేపధ్యంలో 13వ ఆర్థిక సంఘం నిధులను ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా ఖర్చు చేయకపోతే వెనక్కి తీసుకుంటామని గత మే 23వ తేదీన ప్రభుత్వం జీవో 86 జారీ చేసింది. దీంతో మల్లగుల్లాలు పడిన మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు అభివృద్ధి పనులను చేపట్టేందుకు టెండర్ల పిలిచినా కాంట్రాక్టర్లు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. మున్సిపాలిటీలో 13వ ఆర్థిక సంఘం నిధులు 2013-2014 సంవత్సరానికి రూ. 3.75కోట్లతో 18 మేజర్ డ్రైనేజీలను, 2014-2015 సంవత్సరానికి రెండు కోట్ల తొమ్మిది డ్రైనేజిలను నిర్మించేందుకు టెంటర్లను పిలిచారు. కాంట్రాక్టర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఇంజనీరింగ్ అధికారులు మిన్నుకుండిపోయారు. అమృత్ పథకం కింద 50 లక్షల రూపాయలతో ప్రతిపాదించిన అభివృద్ధి పనులు ముందుకు సాగడంలేదు.
వాస్తవానికి మున్సిపాలిటీలో గత నాలుగేళ్ల నుంచి 6.04 కోట్ల రూపాయల 13వ ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేయలేదు. ఈ నిధులను ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా ఖర్చు చేయకపోతే వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ పాలకవర్గసభ్యులలో, అధికారులలో ఎటువంటి చలనం కనిపించడంలేదు. ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీ జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో నిధుల వినియోగంపై ఎమ్మెల్యే మీసాల గీత ప్రస్తావించారు. నిధులను సకాలంలో ఖర్చు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రెండునెలలో టెండర్లను పిలిచి పనులను పూర్తి చేస్తామని మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు చేసిన ప్రకటనలు కార్యరూపం దాల్చలేదు. ముఖ్యంగా నిధుల వినియోగంపై మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ కూడా దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంజనీరింగ్ అధికారులపై ఒత్తిడి తెచ్చి కాంట్రాక్టర్ల ద్వారా పనులు చేయించడంలో ఏమాత్రం శ్రద్ద చూపడం లేదని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ నెలాఖరునాటికి ఈ నిధులను వినియోగిస్తారా? వెనక్కి పంపిస్తారా? అనే సందేహలు వ్యక్తం అవుతున్నాయి. నిధుల వినియోగంపై శనివారం జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించేందుకు కౌన్సిల్ సభ్యులు సిద్ధమవుతున్నారు.