S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆండ్ర జలాశయం నీరు నేరుగా రైతులకు అందించాలి

బొండపల్లి, నవంబర్ 18: ఆండ్ర జలాశయం నుండి ఎంఎన్ ఛానల్ ద్వారా రైతులకు సాగు నీరు అందించాలని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు రాంబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం బొండపల్లిలో సిపిఎం ఆధ్వర్యంలో రైతుల నుండి సంతకాలు సేకరించి పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆండ్ర జలాశయం నుండి విడుదలైన నీరు కిర్లవానిచెరువునుండి ఎంఎన్ ఛానల్‌కు చేరుతుందని, ఇందువలన రైతులకు ఉభాలు ఆలస్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఏడాది రైతులు సకాలంలో వరినాట్లు వేయనందున రైతులు ఆర్ధికంగా నష్టపోయారని చెప్పారు. ఎం ఎన్ ఛానల్ ద్వారా నేరుగా సాగు నీరు అందిస్తే సుమారు 26 గ్రామాల ఆయకట్టుకు నీరు అంది రైతాంగానికి మేలు కలుగుతుందని తెలిపారు. ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని ప్రభుత్వం చెపుతోందని, వీటి అభివృద్ధికి మీనమేషాలు లెక్కిస్తుందని ఆరోపించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా విశాఖ, శ్రీకాకుళం జిల్లాతోపాటు విజయనగరంజిల్లాకు మేలు జరుగుతుందని తెలిపారు. సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మిస్తే సుమారు 8 లక్షల ఎకరాలకు సాగునీటి సమస్య తీరుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆండ్ర కుడికాలువ, గుర్ల గెడ్డ సుజలస్రవంతి ప్రాజెక్టులు వెంటనే కట్టాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు రాకోటి రాములు, సిపిఎం డివిజన్ కార్యదర్శి పురం అప్పారావు, మండల పార్టీ బాధ్యుడు పైడిపునాయుడు, అప్పారావు,సత్యరారాయణ పాల్గొన్నారు.