S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మానవతామూర్తి

‘ఆధ్యాత్మిక శక్తి.. మానవతామూర్తి’ చినజీయర్ స్వామి వారి గురించి చెప్పిన విషయాలు ఉత్తేజం కలిగించాయి. కొద్దికాలం క్రితం వారి దర్శన భాగ్యం కలిగింది. వ్యాసం చదువుతుంటే ఆనాటి విషయాలు గుర్తుకొచ్చి తనువు పులకించింది. స్వామీజీ మా పక్కనే ఉన్న అనుభూతి కలిగింది. ఉన్నాడా ఈ మనిషి అంటూ గోపాలంగారు ముల్లా నస్రుద్దీన్ గురించి చెప్పిన విషయాలు ఆసక్తి కలిగించాయి. ముల్లా కథలు చదువుతూ మన రామలింగడి కథల్లాగ ఉన్నాయే అనుకునేవాళ్లం. మనం పిల్లలకు ఈ కథలు చెప్తూ ఉండాలి.
-ఎ.చైతన్య (వాకలపూడి)

శ్లాఘనీయం
ఆధ్యాత్మిక శక్తి, మానవతా మూర్తి అయిన చిన్నజీయర్ స్వామివారి జన్మవృత్తాంతంతోబాటు, ఈయన ఎదుగుదల, ఆధ్యాత్మిక చింతన, వేద విద్యాలయాల స్థాపన, సమాజ సేవ బహుళ శ్లాఘనీయం. ఇలాంటి గురుతుల్యుల వలన ధర్మం ఇంకా ఈ జగత్తులో నిలచి ఉన్నది. వేద ప్రమాణాన్ని వేదికగా చేసుకుని వైష్ణవ సిద్ధాంతకర్తలు శ్రీవిశిష్టాద్వైతాన్ని స్థాపించి శ్రీ మహావిష్ణువే ఆదిదేవునిగా ప్రచారం చేసి శివతత్వాన్ని తక్కువ చేయడం చూస్తున్నాం. ఆదిశంకరులు ఆత్మ, పరమాత్మ రెండూ వేరు కావని అద్వైతాన్ని బోధించి శివకేశవులకు అభేదం కల్పించారు. అద్వైతులు హిందూ అవతారాలను సమదృష్టితో వీక్షిస్తే విశిష్టాద్వైతులు శివనామాన్ని అస్మరణీయం చేశారు. మధ్యలో మధ్వాచార్యుల వారి ద్వైతం మరొక వివరణ చేసింది. అలాగే వ్యాసభారతంలోని గీతాసారాన్ని వారివారి దైవాల కనుకూలంగా వ్యాఖ్యానాలు చేశారు. వేదాలు ఒకటే అయినా వేదార్థాలు అనేకం కావడం వలన భక్తులు కూడా శాఖోపశాఖలుగా విడిపోయారు. వీరిలో అనైక్యతకు ఇదొక ప్రబల కారణం. అమృతవర్షిణి బాగా ఆకట్టుకుంటోంది. ఇతర శీర్షికలు ఆలోచింపజేసేవిగానూ.. చదివించే రీతిలో ఉండటం ఆదివారం అనుబంధం విశేషం.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)

కనువిప్పు
‘చిరాకులు - చిగురుటాకులు’ కథ సహజంగా ఉంది. భార్యాభర్తలు పెళ్లైన కొత్తలో ఎలా అన్యోన్యంగా ఉంటారు, రాన్రాను ఒకరినొకరు అపార్థం చేసుకుంటూ, దూరం చేసుకుంటూ, ఒకరి మీద ఒకరు దురభిప్రాయాలు ఎలా ఏర్పరచుకుంటారో, ఎలా అసహనం వ్యక్తం చేసుకుంటారో తెలియజేసింది. తమకు పుట్టబోయే పిల్లల భవిష్యత్‌ను గురించి ఆ భార్యాభర్తల ఆలోచన నవ్వించింది. అయితే భార్యాభర్తలు ఒకరిపై ఒకరు లోపాలు ఎత్తిచూపటం మానేసి తమ లోపాలను సరిదిద్దుకొని పరస్పరం అన్యోన్యంగా ఉంటే జీవితం స్వర్గదాయకం అవుతుందని సందేశాన్నిచ్చింది.
-సరికొండ శ్రీనివాసరాజు (వనస్థలిపురం)

యుద్ధం
‘సండే గీత’ శీర్షికన ప్రచురించిన ‘యుద్ధం’లో మనలని మనం మోసం చేసుకుంటే ఓడిపోవడమే కాదు, అది యుద్ధం కూడా అవుతుందని చక్కగా వివరించారు. ఓ చిన్న మాట వలన ఎంతో మందికి ఆనందం కలుగుతుందని చక్కగా చెప్పారు. ‘కవర్‌స్టోరీ’ ఆధ్యాత్మిక శక్తి.. మానవతా మూర్తి ఆరుపదుల వయస్సులో అడుగిడిన శ్రీ చినజీయర్ స్వామి వారి జీవిత విశేషాలను ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్న మార్గదర్శకులు గూర్చి తెలిపిన విశేషాలు మాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)

గొప్ప సత్యం
నిన్ను నీవు వంచన చేసుకుంటే ఇతరులతోనే కాదు నీతో నువ్వు కొట్లాడినా పరాజయం తప్పదని ‘సండే గీత’లో చెప్పినది గొప్ప సత్యం. అలాగే జీవితాన్ని ఆనందించడానికి ఘనకార్యాలు అక్కర్లేదు. చిన్నచిన్న మామూలు విషయాలే చాలని ఓ చిన్న మాటగా చక్కగా చెప్పారు. సంఘ్ ఆశయాలు, సిద్ధాంతాలు, ప్రభుత్వ ఆచరణలో కనిపించవేమి అని అడిగితే మీరు చెప్పిన సమాధానం బాగుంది. ఇప్పటికే మన లౌకిక వాదులు దేశ విదేశాల్లో ప్రభుత్వం చాదస్త హిందుత్వ అజెండా అమలు చేస్తున్నదని గగ్గోలు పెడుతున్నారు. ఆ ప్రచారాన్ని ముఖ్యంగా ముస్లిం దేశాలు నమ్మి మనతో శత్రుత్వం వహిస్తున్నాయి.
-బి.సోనాలి (సూర్యారావుపేట)

సంగీత సద్గురువు
మల్లాది సూరిబాబుగారు ‘సంగీత సద్గురువు’ల గురించి చెప్పిన విషయాలతో మా హృదయాలు పులకించాయి. శ్రోతల స్థాయికి సంగీతం పడిపోకుండా వారి సంగీతాభిరుచిని పెంపొందించాలి అని చెప్పడం ఎంతో బావుంది. క్రైం కథలో జిమ్ మృత్యువుని తప్పించుకొనేందుకు మృత్యువుతోనే బేరం ఆడటం తమాషాగా ఉంది. చివరకు మృత్యువు తప్పినా యావజ్జీవ కారాగార శిక్ష పడటం ఒక ఝలక్!
-పి.శుభ (కాకినాడ)
**
మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు పంపించవచ్చు.