S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘్ఫజెంట్స్’ ఈదగలవు!

నెమళ్లను పోలినట్లు కనిపించే ‘్ఫజెంట్స్’, ఒకే కుటుంబానికి చెందివైనప్పటికీ వాటిమధ్య ఎన్నో వైరుధ్యాలున్నాయి. ఆసియా దేశాల్లో నెమళ్లు కనిపిస్తే ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల్లో ‘్ఫజెంట్స్’ ఉంటాయి. మగనెమళ్ల తోక (్ఫంచంతో కూడి) కనీసం ఐదు అడుగుల పొడవుంటుంది. అడవుల్లో నెమళ్లు కనీసం పాతికేళ్లు బతుకుతాయి. నీలం, నలుపు, సప్తవర్ణ ఛాయతో, వంద ఈకలు, ప్రతి ఈకపై నెమలికన్నును పోలిన రంగుల వలయం ఉంటాయి. బరువుకూడా ఎక్కువే. ఆడ నెమళ్లు కాస్త చిన్నవిగా, ముదురు బూడిద లేదా గోధుమవర్ణంలో ఉంటాయి. కానీ ‘్ఫజెంట్స్’ వీటికి భిన్నంగా ఉంటాయి. వీటిలో మగవాటికి పొడవైన తోక ఉన్నా నెమలికి ఉన్నంతగా ఉండదు. భిన్నమైన, ఆకర్షణీయమైన రంగులున్నప్పటికీ నెమలితో సరిజోడుగా ఉండదు. సైజుకూడా దానికన్నా చిన్నగానే ఉంటుంది. వీటి జీవితకాలం నెమలితో పోలిస్తే ఐదారేళ్లు తక్కువ. అన్నట్లు నీళ్లలో ఈదగలగడం ఫీజెంట్స్ ప్రత్యేకత. పైగా గంటకు పది కిలోమీటర్ల వేగంతో పరిగెట్టగలగడంలో ఇవి దిట్టలు.

ఎస్.కె.కె.రవళి