S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జీతాలు పెంచండి

హైదరాబాద్, నవంబర్ 19: మూలుగుతున్న నక్కపే తాటికాయ పడనుంది. అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జిహెచ్‌ఎంసిపై అదనపు ఆర్థిక భారం పడనుంది. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయటం ఎలా అని జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటుంటే మరో వైపు కార్పొరేటర్లు తమకు జీతాలు పెంచాలని సర్కారుకు ప్రతిపాదన పంపారు. పాలక మండలి అందుబాటులోకి వచ్చి పది నెలలు పూర్తయినా, నేటికీ కార్పొరేటర్లకు అంటూ ప్రత్యేక బడ్జెట్ ఏమీ లేదు. అంతేగాక, ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడే మున్సిపల్ వ్యవహారాల శాఖకు మంత్రిగా ఉండటంతో ఆదాయం కోసం అదనపు డ్రామాలేమి చేసినా, పరిణామాలు సీరియస్ ఉంటాయన్న విషయాన్ని గుర్తించిన కార్పొరేటర్లు ఇదివరకు జరిగిన స్థారుూ సంఘం సమావేశం జరిగినపుడుల్లా తమకు వ్యక్తిగత ప్రయోజనం చేకూర్చే ఒక్క విషయాన్నైనా ప్రస్తావిస్తూ వచ్చారు. బడ్జెట్ ఎలాగో లేదు. కనీసం తమకు బీమా, సెల్‌ఫోన్ బిల్లులు, మెడికల్ రీయంబర్స్‌మెంట్లు, ల్యాప్‌ట్యాప్‌లతో పాటు స్టడీ టూర్లయినా దక్కించుకోవాలని కార్పొరేటర్లు తహతహలాడుతున్నారు. మరోవైపేమో ఖజానా ఖాళీ అయి మున్ముందు జీతాలు కూడా చెల్లించటం కష్టమయ్యే పరిస్థితులను ఎలా అధిగమించాలోనంటూ బేజారవుతున్న అధికారులు కార్పొరేషన్‌కు ఆదాయాన్ని సమకూర్చే ప్రతి వనరును, మార్గాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ క్షేత్ర స్థాయి విధులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. తామేమీ తక్కువ లేమంటూ అధికారులకు దీటుగా కార్పొరేటర్లు కూడా తమకు సెల్‌ఫోన్ బిల్లులు చెల్లించాలని, బీమా సౌకర్యాన్ని కల్పించాలంటూ స్థారుూ సంఘం సమావేశంలో తమ కోరికలను ప్రస్తావిస్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే రాష్టవ్య్రాప్తంగా నగర మేయర్లు, జడ్పీ చైర్మన్ల జీతాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా ప్రతిపాదనలో ప్రస్తావించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఎన్నికైన 150 మంది కార్పొరేటర్లు, అలాగే ఎక్స్ ఆఫిషియో, నామినేటెడ్ సభ్యులతో కలిపి మొత్తం 155 మంది కార్పొరేటర్లకు ప్రతి నెల రూ. 6వేలను గౌరవ వేతనంగా చెల్లిస్తున్నారు. అయితే కార్పొరేటర్లు ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల ప్రకారం వారి జీతాన్ని ఏకంగా రూ. 30వేలకు పెంచాలని కోరినట్లు సమాచారం. మరికొందరు కార్పొరేటర్లయితే రూ. 40వేలు, రూ. 60వేలకు పెంచితే బాగుంటుందని స్థారుూ సంఘంలో తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు సమాచారం. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కార్పొరేటర్లు కోరిన బీమా, సెల్‌ఫోన్ల బిల్లులు పెద్దగా ప్రభావం చూపకపోయినా, జీతాల పెంపు, స్టడీ టూర్లకు వెళితే బల్దియాపై అదనంగా భారం పడే అవకాశాలున్నాయి.