S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వరలక్ష్మి చిందులు!

తమిళ హీరోయిన్ వరలక్ష్మి అంటే తెలుసా? ఈ పేరుచెబితే ఎవరికీ తెలియదు. కానీ హీరో విశాల్ లవర్ అంటే మాత్రం అందరు గుర్తుపడతారు. స్టార్ హీరో శరత్‌కుమార్ కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ విశాల్ లవర్‌గానే పాపులర్ అయింది. ఈమధ్య విశాల్, వరలక్ష్మిల మధ్య ఎందుకు చెడిందో తెలియదు కానీ ఇద్దరిమధ్య దూరం బాగా పెరిగింది. లేటెస్ట్‌గా వరలక్ష్మి.. శింబు ఇచ్చిన విందులో పాల్గొని అతనితో కలిసి చిందులు వేయడం అందరికి షాక్ ఇచ్చింది. పైగా ఈ కార్యక్రమంలో మరో హాట్ భామ త్రిష కూడా పాల్గొంది. విశాల్ బ్రేక్‌అప్ తరువాత వరలక్ష్మి శింబుతో అంత క్లోజ్‌గా ఉండడం.. ఆసక్తిని రేకెత్తిస్తోంది. నడిగర్ సంగం విషయంలో కూడా శింబు, విశాల్‌కు అపోజిట్‌గానే ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వరలక్ష్మి కూడా శింబుతో ఉండడం చర్చలకు దారితీస్తోంది!!