S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కొత్త స్నేహితులు 22

కానీ మీరు ఖాళీగా వుంటే సాయంత్రం మీ ఇంటికొస్తానని సామ్రాజ్ఞి ఫోన్ చేయడంతో మొదటిసారే ఆమె నిరుత్సాహపరచడానికి మనసొప్పక ‘సరే’నని చెప్పి ఆరోజు తనింటికి స్నేహితులొస్తున్నారనే సమాచారాన్ని సామ్రాట్‌కు చేరవేసి సామ్రాజ్ఞి కోసం ఎదురుచూస్తూ ఇంట్లోనే ఉంది సాహిత్య.
ఇంటిముందున్న పూల మొక్కల్ని చూస్తూ తలుపు తీసే ఉండడంతో సరాసరి ఇంట్లోకి ప్రవేశించింది సామ్రాజ్ఞి.
సోఫాలో కూర్చుని పుస్తకం చదువుతున్నదల్లా గుమ్మం ముందు అలికిడి కావడంతో తలెత్తి చూసి కళ్లతోనే ఆహ్వానిస్తూ ‘‘రండి.. రండి’’ అంది సాహిత్య.
మొదటిసారి కొత్తచోటుకి వెళ్లినపుడు అందరూ సహజంగా చూసే విధంగా నాలుగువైపులా పరికించి చూసి సోఫాలో కూర్చుంటూ అంది సామ్రాజ్ఞి- ‘‘మీ ఇంటి అలంకరణ కూడా మీలానే ఎంతో పొందికగా, చక్కగా ఉంది’’
‘‘నన్ను చూస్తే మీకు పొగడ్తలు తప్ప మరేమీ రావనుకుంటాను’’ అంది సాహిత్య మొహమటంగా.
‘‘అయితే ఇహనుంచీ బాణీ మార్చమంటారా? నా ధాటికి తట్టుకోలేక మావారు ఆఫీసు పని అయిపోయిన తర్వాత కూడా ఎక్కడెక్కడో తిరిగి ఆలస్యంగా ఇంటికొస్తూంటారు రోజూ.
ఈమధ్య అయితే కనీసం వారానికి రెండు రోజులు రాత్రి తొమ్మిదీ, పదీ దాటాకనే వస్తున్నారింటికి. మీవారూ అంతేనా?’’ అంది సామ్రాజ్ఞి అల్లరిగా.
‘‘మీవారు ఆలస్యంగానైనా ఇంటికొస్తున్నారు. మావారైతే.. వారానికి ఆర్రోజులు ఊళ్లోనే ఉండరు..’’ అని ఆగింది సాహిత్య.
‘‘ఉంటే.. ఒకవేళ మీవారూ..’’ అంటూ తటపటాయించింది సామ్రాజ్ఞి.
‘‘నాకు తెల్సి చిన్న ఇల్లేమీ పెట్టుకోలేదులెండి. ఉద్యోగరీత్యా తప్పదు మరి. నేనిక్కడ ఇంటిని చూసుకుంటూ ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూంటే.. ఆయన పాపం ఉద్యోగరీత్య వేరేచోట ఉంటూ అటూ ఇటూ తిరగలేక నానా అవస్థలూ పడుతున్నారు’’ అంది సాహిత్య.
‘‘మీరూ అక్కడికే వెళ్లి ఉండొచ్చుగా!’’ అంది సామ్రాజ్ఞి.
‘‘బాగా చెప్పారు.. ఈ విషయంలో మన ఆడాళ్లందరమూ ఒకేలా ఆలోచిస్తామనుకుంటాను. నేనూ ఆ మాటే అంటే... ‘‘నీకుద్యోగం ఉందిగా, అదెవరు చేస్తారు మరీ!’ అన్నాడు’’ అంది సాహిత్య.
‘‘ఇద్దరూ ఉద్యోగాలు చేస్తేగానీ సంసారం గడవనంత చిన్న ఉద్యోగమా మీవారు చేసేదీ!’’ అంది సామ్రాజ్ఞి సానుభూతిగా.
‘‘అదేం కాదు.. అసలు విషయమేమంటే నన్నాయన వారానికొక్కరోజు కంటే ఎక్కువ భరించలేరు. అదీ అసలు కారణం’’ అంది సాహిత్య నవ్వుతూ.
సాహిత్య మాటలకు ఒక్క క్షణం నివ్వెరపోయి ‘‘అదేం..పరాయిదాన్నీ, ఆడదాన్నీ అయిన ననే్న ఆకట్టుకున్న మీ అందం మీవారికి నచ్చలేదా!?’’ అంది సామ్రాజ్ఞి.
‘‘పెరటి చెట్టు మందుకు పనికిరాదనే సామెత ఉండనే ఉందిగా మనకు! అయినా విషయం అది కాదు. రోజూ నా మాటలు వినడమంటే విసుగాయనకు.
కబుర్లకూ ఆయనకూ చుక్కెదురు. నాకేమో నేను కన్నవీ, విన్నవీ ఆయనతో పూసగుచ్చినట్టు చెప్పడం అలవాటు. నేను పూసలు గుచ్చడం ఆయనకు నచ్చదు. ఎటువంటి ఉపోద్ఘాతమూ లేకుండా నేరుగా పూసగుచ్చిన దండ మెడలో వేస్తేనే ఇష్టం ఆయనకు’’ అంది సాహిత్య నవ్వుతూ.
‘‘సరిపోయింది.. అయినా మన ఆడాళ్ల జీవితాలే అంతనుకుంటాను. విచిత్రం చూడండి. నాదేమో మీ ఆయన మనస్తత్వం. మావారిదేమో మీ మనస్తత్వం. మీవారితో మీరెలా సర్దుకుపోతున్నారో గానీ నేను మాత్రం మావారు నా మాట వినకపోతే ఊరుకోను’’ అంది సామ్రాజ్ఞి అదేదో గొప్ప విషయంలా.
ఎదుటివారు తమ మాట వినడం తమ ప్రతిభవల్లేననుకునే వాళ్లు గతంలో తారసపడకపోలేదు సాహిత్యకు. సామ్రాజ్ఞితో తనకున్న కొద్దిపాటి పరిచయంతోనే ఆమె మనస్తత్వం చూచాయిగా అర్థమైందామెకు.
నిజానికి అటువంటివాళ్లతో సమయం గడపడం ఎంతో కష్టమూ, వ్యక్తిగతంగా అయిష్టమూ కూడా సాహిత్యకు.
కాకపోతే తనంతట తానే తన స్నేహం కోరి వచ్చిన ఆమె ఎటువంటిదైనా ఆమె మనసు కష్టపెట్టడం సంస్కారం కాదనే భావనతో మనసులోని భావాల్ని బయటకు వ్యక్తం కానీయకుండా, ‘‘అంటే ఇంట్లో నిజంగా మీరు పేరుకు తగ్గట్టు మహారాణేనన్నమాట!’’ అంది సాహిత్య.
అందుకే మాత్రమూ సిగ్గుపడకుండా, ‘‘ఒకరకంగా అంతేలెండి. చిన్నప్పటినుంచీ మా అమ్మా, నాన్నా నా పేరుకు తగ్గట్టే మహారాణిలా పెంచారు నన్ను’’ అంది సామ్రాజ్ఞి ఒకింత గర్వంగా.
ఏం మాట్లాడాలో తెలియక టీవీ ఆన్ చేసింది సాహిత్య. రిమోట్‌తో ఛానల్స్ మారుస్తోండగా సామ్రాజ్ఞి ఉన్నట్టుండి ‘ఆగండాగండి’ అంది.
సాహిత్య ఆమె వైపు నవ్వుతూ చూసి, టీవీలో వస్తోన్న సీరియల్‌ను నిర్నిమేషంగా చూస్తోన్న సామ్రాజ్ఞితో, ‘‘మీకు టీవీ సీరియల్స్ అంటే ఇష్టమా?’’ అంది.
‘‘ఆ.. అన్నీ కాదు.. భర్తలనదుపులో పెట్టేందుకు చిట్కాలు పుష్కలంగా ఉండే సీరియల్స్ కొన్ని వస్తున్నాయి చూడండి. అవంటే ఎంతో ఇష్టం నాకు.
నిజం చెప్పాలంటే పెళ్లయ్యేవరకూ అల్లారుముద్దుగా పెరగడంవల్ల భర్తనెలా అదుపులో ఉంచుకోవాలో నాకు తెలియదు.
ఆ విషయాలు కొద్దో గొప్పో తెల్సుకున్నానంటే ఈ సీరియల్స్ చూడడం వల్లేనని చెప్పాలి. అప్పుడప్పుడూ మా అమ్మ కూడా మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటుందనుకోండి!’’ అంది సామ్రాజ్ఞి తన జ్ఞాన సముపార్జనకు కారణాలు చెపుతూ.
‘‘మనకు తెలియని విషయాలు వాటిలో ఏముంటాయో నాకు అర్థం కాదు’’ అంది సాహిత్య ఆమెమీద జాలిపడుతున్నట్టుగా చూస్తూ.

-ఇంకా ఉంది

సీతాసత్య