యుగయుగాంతరాల...
Published Sunday, 20 November 2016పెదవి దాటని మాట
వౌనంగానే పల్కరించి
చూపులతో మాట్లాడింది
యుగయుగాంతరాల భావమొకటి
వాయు తరంగాలలోంచి
అంతరంగాన్ని కల్లోలపరిచింది
విలువైన ద్రవ్యరాశి
చెల్లని నాణేల మోతకు
నిలువ నీడలా నిలుచుని
మూగవోయంది!
సుఖ లాలసలో
మన్ను మిన్ను మరచిన
నగరానికి పల్లె మూలల
వ్యథలు - గాథలు రుచించలేదు
రసరాజ్యమంతా
తమదేననుకొనే భావుకులు
పచ్చి నిజాల ఫలాలు ఆరగించుకోలేరు!!