S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బిందు సేద్యానికి నిధుల తిప్పలు..!

నల్లగొండ, నవంబర్ 20: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిందు..తుంపర సేద్యం సాగును ప్రోత్సాహిస్తామన్న ప్రకటనకు అనుగుణంగా నిధుల విడుదల చేయకపోవడంతో మండలాల్లో సూక్ష్మ నీటిపారుదల పథకం పరికరాల మంజూరుకు రైతులు రెండేళ్లుగా ఎదురుచూపులు పడుతున్నారు. అసలే కరవు పీడిత, వర్షాభావ ప్రాంతమైన నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల రైతాంగం ఎక్కువగా భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం సాగిస్తుంది. దీంతో ఈ ప్రాంత రైతుల నుండి తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగుకు బిందు, తుంపర సేద్య పరికరాల కోసం డిమాండ్ నెలకొంది. ఎస్సీ, ఎస్టీలకు100శాతం, బిసిలకు 90శాతం, చిన్న, సన్నకారు రైతులకు90శాతం, ఇతర సామాజిక వర్గాల రైతులు 80శాతం సబ్సిడీ మేరకు, దొడ్డుకారు రైతులు 1హెక్టారు వరకు 75శాతం మేరకు సబ్సిడీతో జిల్లాలో సూక్ష్మ సేద్య పథకం అమలవుతుంది. అయితే 2014-15నుండి ప్రభుత్వం లక్ష్యాల మేరకు నిధుల మంజూరు చేయకపోవడంతో పెండింగ్ దరఖాస్తులను 2015-16కు మార్చి 5,740హెక్టార్లకుగాను ఆ రెండేళ్లలో 3,245హెక్టార్లకు మాత్రమే మంజూరు సూక్ష్మ సేద్య పరికరాలు మంజూరు చేశారు. అయితే సూక్ష్మ సేద్యం పథకం కింద రెండేళ్లుగా భారీ ఎత్తున దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటం రైతులకు ఆశనిపాతమైంది. రైతు వాటా డిడిలు చెల్లించి ఆర్ధిక సంవత్సరం ముగిసిపోతున్నా మంజూరుకు సూక్ష్మ సేద్య పరికరాల మంజూరు రాకపోవడంతో పంటలు, తోటల సాగులో రైతులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. 2016-17ఆర్ధిక సంవత్సరంలో సూక్ష్మసేద్య పథకం పరికరాల మంజూరు కోరుతు రైతుల నుండి 5,624దరఖాస్తులు అందాయి. వారికి సూక్ష్మ సేద్య పరికరాల మంజూరుకు 48.24కోట్లు మంజూరుకావాల్సివుండగా 1586మందికి 17కోట్లు మాత్రమే మంజూరు చేశారు. వీటిలో 1,785హెక్టార్లలో బిందు(డ్రిప్)సేద్య పరికరాలు పంపిణీకి 7.59కోట్లను మంజూరు చేశారు. మిగతా రైతులకు నిధుల విడుదల కోసం ఎదురుచూపులు పడుతున్నారు.
ధర్మయుద్ధ మహాసభకు బిజెపి మద్దతు
నల్లగొండ టౌన్, నవంబర్ 20: ఈనెల 27న జరుగనున్న ధర్మయుద్ద మహాసభకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు నూకల నర్సింహ్మారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ షెడ్యుల్ కులాల వర్గీకరణ డిమాండ్ న్యాయసమ్మతమైందని, ఎం ఆర్ పి ఎస్ చేస్తున్న పోరాటం సహేతుకమైంది కాబట్టే బిజెపి మొదటి నుండి మద్దతు తెలుపుతుందన్నారు. రాష్ట్రంలో మాదిగలకు, మాదిగ ఉప కులాలకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవంగా బిజెపి ఏనాడో గుర్తించిందని, 1994లో ఎం ఆర్ పి ఎస్ ఉద్యమం ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. వర్గీకరణకు నరేంద్రమోడీ కట్టుబడి ఉన్నాడని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షులు వీరెల్లి చంద్రశేఖర్, చింత ముత్యాల్‌రావు, రామోజు షణ్ముక, నూకల వెంకటనారాయణరెడ్డి, ఓరుగంటి రాములు, పోతెపాక సాంబయ్య, దర్శనం వేణు, బీపంగి జగ్జీవన్‌రాం, పోతెపాక లింగస్వామి, మునికుమార్, తదితరులు పాల్గొన్నారు.