S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాశ్చాత్య పోకడలు వీడాలి

సిద్దిపేట అర్బన్, నవంబర్ 20: సమాజంలో రోజురోజుకు పాశ్చాత్య సంస్కృతి పెట్రేగి పోతుందని, హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని హరిద్వార్ మహామండలేశ్వర్ కైలాసానంద బ్రహ్మచారిజీ అన్నారు. దక్షిణకాశీ ధర్మపురి గోదావరి మహాహారతిలో పాల్గొనేందుకు వెళుతూ ఆదివారం సిద్దిపేట కోటిలింగేశ్వరాలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామిని పలువురు సన్మానించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజురోజుకు హిందూ సంస్కృతిలో పాశ్చాత్య సంస్కృతి పెరిగి పోతుందన్నారు. భారత్‌లో హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పై ఉందన్నారు. గంగా, యమున, గోదావరి, కృష్ణ తదితర నదులన్నీ సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పై ఉందన్నారు. నదుల వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగాలతో పాటు పుణ్యదినాల్లో స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందన్నారు. నదులకు ఉన్న పవిత్రతను అందరు గుర్తించాలన్నారు. హిందూ సంస్కృతి, సాంప్రదాయాల్లో గోవుకు ఎంతో ఉన్నతస్థానం ఉందని, వాటిని రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. తల్లి, తండ్రి, గురవు స్థానం చాలా గొప్పదని, ఆస్థానంకు ఉన్న ఔన్నత్యాన్ని గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.