S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

క్రీడల అభివృద్ధికి సహకారం

సిద్దిపేట, నవంబర్ 20 : క్రీడలు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్ అన్నారు. ఆదివారం కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఆనంతరం విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈసందర్భంగా సిపి శివకుమార్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమే అన్నారు. ఓటమి చెందిన వారు నిరాశ చెందకుండా మరోసారి గెలుపుకోసం కృషిచేయాలన్నారు. విజేతలుగా నిలిచిన వారు విరివిగా టోర్నమెంట్లలో పాల్గొని తమ క్రీడానైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. క్రీడలతో స్నేహ సంబంధాలు మెరుగుపడుతాయన్నారు. క్రీడల పోటీల నిర్వహణకు తమవంతు పూర్తి సహకారం అందిస్తామన్నారు. పోలీసు శాఖ ప్రజలతో మమేకపై పనిచేస్తుందన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పోలీస్‌స్టేషన్‌కు స్వేచ్ఛగా రావాలన్నారు. పోలీసులు ప్రెండ్లీ ఉంటు ప్రజలకు సేవా చేస్తామన్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌ను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానన్నారు.
విజేత వాలీబాల్ అసోసియేషన్ జట్టు
పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట మినీస్టేడియంలో ఆదివారం ఇమాంబాద్, వేదా బిఇడి కళాశాల, పోలీస్ జట్టు, వాలీబాల్ అసోసియేషన్ జట్ల మధ్య జరిగిన పోటీలు ఆకట్టుకున్నాయి. పోలీసుజట్టు, వాలీబాల్ అసోసియేషన్ జట్ల మధ్య పోటీ నువ్వా..నేనా అన్నట్లు సాగింది. మొదటి సెట్టు వాలీబాల్ అసోసియేషన్ కైవసం చేసుకోగా, రెండవ సెట్టును పోలీసు జట్టు కైవసం చేసుకుంది. చివరి సెట్టులో హోరాహోరిగా తలబడ్డారు. చివరకు వాలీబాల్ అసోసియేషన్ జట్టు విజేతగా నిలువగా, పోలీస్ జట్టు రన్నర్స్‌గా నిలిచింది. విజేతలకు ఎస్‌పిఎల్ సహకారంతో ట్రోఫీని సిద్దిపేట సిపి శివకుమార్ అందచేశారు. అలాగే విజేతలకు హెడ్‌కానిస్టేబుల్ అలీ 15వందల నగదు, రన్నర్స్‌కు వెయ్యి రూపాయలు, సిపి విజేతలకు, రన్నర్స్‌కు వెయ్యి రూపాయలు నగదును అందచేశారు. ఈకార్యక్రమంలో సిఐలు వెంకట్‌రెడ్డి, ఆకుల వెంకటేశం, ఎస్‌పిఎల్ వ్యవస్థాపక అధ్యక్షుడు వినోద్ మోదాని, వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

గ్రామస్థాయి నుంచి బిజెపి బలోపేతం
తొగుట, నవంబర్ 20: ప్రధాని నరేంద్ర మోడి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకపోయి పార్టీ బలోపేతానికి కృషిచేయాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తంరెడ్డి అన్నారు. ఆదివారం తొగుట మండల బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి బిజెపి బలోపేతానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ధరలను ఒకే రీతిలో అమలు చేయాలనే సంకల్పంతో కేంద్రం జిఎస్టీ బిల్లును అమలు చేసిందన్నారు. బ్లాక్ మనీని నియంత్రించి పేదల ఆర్థిక స్థితిని మెరుగుపర్చేందుకు ప్రధాని మోడి వేయి, ఐదు వందల నోట్లను రద్దుచేయడం జరిగిందన్నారు. ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారని, సామాన్యులకు ఇబ్బంధులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సహకరించాలన్నారు. రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ సర్కార్ నోట్ల రద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా నూతనంగా జిల్లా అధ్యక్షునిగా మండలానికి విచ్చేసిన నరోత్తంరెడ్డిని మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు హన్మంతరెడ్డి, విభీషణ్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గిరీష్‌రెడ్డి, ఎల్లు రాంరెడ్డి, వడ్లరాజు, కాన్గంటి శ్రీనివాస్, మండల నాయకులు రాంరెడ్డి, లింగం, ఎల్లయ్య, రాజయ్య, రమేశ్, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.