S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సర్కారు బడుల్లో..మెరుగైన వసతులు

చిన్నకోడూరు, నవంబర్ 20: ప్రభుత్వ బడుల్లో మెరుగైన వసతులు కల్పించడమే తన లక్ష్యమని నీటి పారుదల శాఖమంత్రి హరీష్‌రావు అన్నారు. ఆదివారం చిన్నకోడూరు జడ్పీహెచ్‌ఎస్‌లో బాలవికాస్ ఆధ్వర్యంలో దివిష్ మందుల కంపెనీవారు 20 బడులకు 520 డెస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ బడుల టీచర్లు తమవంతు బాధ్యతంగా పని చేయాలన్నారు. చిన్నకోడూరు బడిలో నీటి కొరత లేకున్నా ఉందని దరఖాస్తు ఇచ్చిన హెచ్‌ఎం సుధాకర్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ మనది అని పనిచేసినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. ఇప్పటి వరకు సిద్దిపేట నియోజకవర్గంలోని బడులకు 2100 డెస్కులను అందించామన్నారు. కొద్దిరోజుల్లోనే అన్ని బడుల్లో డిజిటల్ క్లాస్‌రూంలుగా మారుతాయన్నారు. 43 బడులను డిజిటల్ క్లాసులుగా మార్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. గ్రామాల్లో సర్పంచులు దగ్గరుండి పనులు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మాణిక్యరెడ్డి, జడ్పీటిసి సభ్యురాలు కమల, ఆత్మకమిటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, ఎఎంసి చైర్మన్ వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపిపి శ్రీనివాస్‌గౌడ్, డిప్యూటీ ఇఓ శ్యాంప్రసాద్‌రెడ్డి, ఎంపిడిఓ జాఫర్‌ఖాన్, బాలవికాస్ ప్రతినిధులు, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.