S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వైభవంగా కార్తీక దీపోత్సవం

గజ్వేల్, నవంబర్ 20: సుప్రసిద్ధ వర్గల్ శ్రీ వేణుగోపాల స్వామి క్షేత్రంలో ఆదివారం కార్తీక సంబురాలు ఘనంగా జరిగాయి. వేద పండితులు అప్పల విశ్వనాథ శర్మ, శశిధర శర్మ, అనంతగిరిశర్మ, వెంకటరమణశర్మ, మురళీధరాచార్యుల నేతృత్వంలో వందలాదిగా శ్రీ సత్యదేవుడి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్బంగా సతీసమేతులైన స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలతోపాటు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా విపంచి శశిధర శర్మ బృందం నిర్వహించిన సంగీత విభావరి, కోలాటం, కార్తీక దీపోత్సవం, ఆధ్యాత్మిక వాతావరణాన్ని స్ఫురింపజేసింది. నిర్వాహకులు ప్రొద్దుటూరి రాజులు, కార్యక్రమ దాత టేకులపల్లి రాంరెడ్డిల నేతృత్వంలో క్షేత్రానికి తరలి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలతోపాటు మహా ప్రసాదం అందజేయగా పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతీ తీర్థస్వామి భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు.