S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘బిల్ట్’ను కాపాడుతాం

నక్కలగుట్ట,నవంబర్ 20: జిల్లాలోని కమలాపూర్‌నందు గల బిల్ట్ కార్మాగారాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తోందని మహబూబాబాద్ ఎంపి సీతారాంనాయక్ అన్నారు. ఆదివారం టిఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1970లో స్థాపింప బడిన కార్మాగారం కొంత కాలం నడిచిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే షట్‌డౌన్ అయిందని తెలిపారు. గిరిజన ప్రాంతంలో ఉన్నందున దీనిపై తాను అనేక మార్లు పార్లమెంట్‌లో, ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి కూడా తీసుకుని వెళ్లానని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాజమాన్యంతో చర్చించిందని తెలిపారు. యాజమాన్యం విద్యుత్తు ఇతరత్ర సబ్సిడీలు ఇస్తే నడిపేందుకు అమోదించిందని, దానికి అనుగుణంగా జిఓ కూడా విడుదల చేశామని గుర్తుచేశారు. సంవత్సరానికి 30 కోట్ల రూపాయల ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని, ఏడు సంవత్సరాల వరకు ఈ సబ్సిడీని కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ కూడా ఇచ్చిందని తెలిపారు. అయినప్పటికి యాజమాన్యం ముందుగా ఒప్పుకున్న ప్రకారం సబ్సిడీ ఇస్తామని చెప్పినా మరికొన్ని నిబంధనలు పెట్టి దానిని నడపకపోవడం శోచనీయమని తెలిపారు. ప్రభుత్వం ఇంత కృత నిశ్చయంతో ఉన్నా ప్రతి పక్షాలు కావాలని పనికట్టుకుని ప్రభుత్వం ఏమి చేయడంలేదని, ఎంపి పట్టించుకోవడం లేదని ప్రచారం చేయడం విచారకరమని అన్నారు. పెద్దనోట్ల రద్దును తెలంగాణ ప్రభుత్వం సమర్థిస్తుందని, కాని పేద ప్రజల కష్టాలను, రాష్ట్రంపై పడే భారాన్ని వివరించడానికి ముఖ్యమంత్రి డిల్లీ వెళ్లారని తెలిపారు. దీనిని కూడా ప్రతి పక్షాలు ముఖ్యమంత్రి తమ బ్లాక్‌మనీని కాపాడుకోవడానికి డిల్లీ వెళ్లారని రాద్దాతం చేయడం సబబుకాదని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తుందని, ఇప్పటి వరకు ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా స్వచ్ఛమైన పాలన అందింస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు జన్నుజకర్యా, లలితాయాదవ్, నరుూమొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

నోట్ల రద్దు బిజెపి పెద్దలకు ముందే తెలుసు
సిట్‌తో విచారణకు సిపిఐ డిమాండ్ * నిత్యావసర, రైతు సమస్యలపై పోరాటం
భీమదేవరపల్లి, నవంబర్ 20: పెద్దనోట్ల రద్దు విషయం భారతీయ జనతా పార్టీ పెద్దలకు ముందే తెలుసునని, అందుకే ఆపార్టీ నాయకులు నోట్లు మార్పిడి చేసుకున్నారని దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేపడితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని భారత కమ్యూనిష్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో ఆ పార్టీ పునర్నిర్మాణ మహాసభలు ముల్కనూర్‌లో ఆదివారం మండల కార్యదర్శి ఆదరి శ్రీనివాస్ అధ్యక్షతన జరుగుతున్నాయి. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో ప్రజా ఉద్యమాలు తప్పవన్నారు. తెలంగాణ ప్రజల ఆలోనచలు మార్చేందుకు కెసిఆర్ ఉన్న భవనాలు కూల్చీవేత అని ఒకసారి.. మరోసారి 31 జిల్లాలు ఏర్పాటు చేస్తామని మరోసారి ఇలా అనేక ప్రకటనలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. 500, 1000 రూపాయల చోట్లు రద్దు విషయం ముఖేష్ అంబానీ, అదానీలకు ముందె తెల్సునని ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నాయని దీనిపై విచారణ చేయాలన్నారు. నోట్లు రద్దుతో కేవలం సామాన్యులు మాత్రమే ఇబ్బంది పడుతున్నారన్నారు. జిల్లా కార్యదర్శి సిరబోయిన కరుణాకర్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వం కెజి నుండి పిజి వరకు ఉచిత విద్య, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. పార్టీ మహాసభలలో తెలంగాణలో కేంద్ర, రాష్ట్ర ప్రజావ్యతిరేఖ విధానాలపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మహాసభలలో సిపిఐ నాయకులు మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, జిల్లా నాయకులు కర్రె బిక్షపతి, ఆదరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.