S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పరోపకారానికి మనిషి శ్రమించాలి

వరంగల్ (కల్చరల్), నవంబర్ 20: ప్రతి మనిషి తేనె లాంటి మధురానుభూతిని కలిగించే మనస్సుతో ఉండి పరోపకారనికి శ్రమించాలని పరమహంస పరివ్రాజకాచార్య మాధవానంద సరస్వతి స్వామిజీ అన్నారు. ఆదివారం కాజీపేటలోని స్వయంభూ శ్రీ శే్వతార్క మూలగణపతి దేవాలయ క్షేత్రంలో జరిగిన మహామధురాభిషేకంలో ఆయన పాల్గొన్నారు. ఆయనను ఆలయ వేదపండితులు మంగళవాయిద్యాల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు. తోగుట ఆశ్రమం ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకొని 548 లీటర్ల తేనెతో శే్వతార్కుడికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామిజీ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తు తేనెతీగ ప్రతి పుష్పంపై వాలుతూ అందులోని మకరందాన్ని తీసుకొని గూడును నిర్మించి అందులో తేనెను దాచి మరో గూడు కోసం వెళ్తుందో.. అదేవిధంగా మనిషి కూడ పరుల పరమార్ధం కోసం, పరుల ఆనందం కోసం జీవితంలోని కొంత సమయాన్ని వెచ్చించాలని అన్నారు. ఆరోగ్య రహస్యం ఆనందమేనని అందుచేత ఆనందాన్ని ఇతరులకు పంచడం ద్వారా సంస్కారాన్ని కూడా పొందవచ్చని ప్రకృతి నుండి మనిషి నేర్చుకునే అంశాలు ఎన్నో ఉన్నాయని వివరించారు. ఈ పూజాకార్యక్రమాన్ని ఆశ్రమ నిర్వాహకులు పార్నంది రఘురామశర్మ, శివరామకృష్ణశర్మ, త్రిపురారి నాగరాజ శర్మలు నిర్వహించగా ఆలయ సిబ్బంది సహాయ సహకారాలను అందించారు. ఈ కార్యక్రమంలో కాజీపేట సిఐ రమేష్ కుమార్ దంపతులు, విద్యుత్ శాఖ అధికారి నిమ్మటూరి శ్రీకృష్ణశర్మ దంపతులు స్థానిక రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

‘చిల్లర’ కష్టాలు!
గంగారం, నవంబర్ 20: పెద్దనోట్ల రద్దుతో 2వేల నోటుకు చిల్లర దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మండలంలోని ఆసరా పెన్షన్ దారులు వాపోతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం పర్యటించి పెన్షన్లు అందుకుంటున్న వృద్ధ,వితంతు,వికలాంగులను పలకరించగా నోట్ల కష్టాలను వెళ్లగక్కారు. మండలంలోని పోస్ట్ఫాసులకు ఆసరా పెన్షన్ల పంపిణీ నిమిత్తం రూ.2వేల నోట్లు మాత్రమే వచ్చాయని బ్రాంచ్ పోస్టుమాస్టర్లు అంటున్నారు. ఒక్కొక్క వృద్ధ, వితంతువులకు రూ.వెయ్యి ఇవ్వాల్సి ఉండడంతో అక్టోబర్ నెలకు గాను ఇద్దరికి కలిపి 2వేల నోటు ఇస్తున్నట్టు తెలిపారు. ఇద్దరికి కలిపి రూ.2వేల నోటు ఇవ్వడంతో ఆ నోటుకు చిల్లర లేక తాము కనీసం నిత్యావసర సరకులు కూడా కొనుగోలు చేయలేకపోతున్నామని వారు వాపోతున్నారు. వృద్దులకు, వితంతువులకు రూ.వెయ్యి చొప్పున, వికలాంగులకు రూ.1500 ఇవ్వడంతో ఇద్దరు వికలాంగులకు 3వేలు, మరో వృద్దునికి వెయ్యి కలిపి నాలుగు వేలు చేసి 2వేల నోట్లు రెండు ఇస్తున్నారు. ఇదే అదునుగా చేసుకొని కొందరు దళారులు 2వేల నోటుకు 200 కమీషన్లు కట్‌చేసుకొని 18 వంద రూపాయల నోట్లు ఇస్తున్నట్లు సమాచారం.