S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నకిలీ విలేఖరుల అరెస్టు

ఏటూరునాగారం, నవంబర్ 20: మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామ సమీపంలో టివి-9, టివి-5, ఎన్‌టివి విలేఖర్లమంటూ ఇసుక లారీలను నిలిపి, హల్‌చల్ చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన ముగ్గురు నకిలీ విలేఖర్లను శనివారం రాత్రి పోలీసులు అరెస్టుచేసినట్లు ఏటూరునాగారం సబ్ డివిజనల్ పోలీసు అధికారి కె.దక్షిణామూర్తి తెలిపారు. ఆదివారం స్ధానిక డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నకిలీ విలేఖరుల అరెస్టును చూపారు. డిఎస్పి కధనం మేరకు వివరాలిలావున్నాయి. మంగపేట మండలం బోరునర్సాపురం గ్రామానికి చెందిన జాగటి చిన్న, మల్లూరు గ్రామానికి చెందిన గడ్డం ప్రశాంత్, నర్సింహసాగర్ గ్రామానికి చెందిన ఇంబటి నవీన్‌లు తాము టివి-9, టివి-5, ఎన్‌టివి విలేఖర్లమంటూ ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామం వద్ద ఏటూరు ఇసుక క్వారీనుండి లోడ్‌తో వెళ్తున్న లారీలను నిలిపి డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలుచేస్తున్న క్రమంలో ట్రాఫిక్ స్తంభించడంతో గ్రామస్తులు వారిని ఎందుకు డబ్బులు వసూలుచేస్తున్నారని ప్రశ్నించగా వాగ్వివాదం జరిగడంతో వారికి దేహశుద్దిచేసిన గ్రామస్ధులు పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం గమనించిన నకిలీలు పారిపోతుండగా ఏటూరునాగారం చెక్‌పోస్టు వద్ద స్ధానిక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి కేసునమోదుచేసి రిమాండుకు తరలించనున్నట్లు డిఎస్పి తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పి దక్షిణామూర్తి మాట్లాడుతూ... మీడియాలో పనిచేస్తున్న వారు తమ సంస్ధనుండి ఇచ్చే అక్రిడిటేషన్లుగాని, ఐడి కార్డులనుగాని తప్పక కలిగివుండి పోలీసులకు సహకరించాలన్నారు. మీడియా ముసుగులో తప్పుడు పనులకు పాల్పడితే ఎంతటివారినైనా సహించేదిలేదని డిఎస్పి హెచ్చరించారు. ఈకార్యక్రమంలో స్ధానిక సిఐ డి.రఘుచందర్, ఎస్సై సట్ల కిరణ్‌కుమార్, కన్నాయిగూడెం ఎస్సై సిహెచ్.వెంకటేశ్వరావుపాల్గొన్నారు.