S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఒడిదుడుకులకు ఆస్కారం

న్యూఢిల్లీ, నవంబర్ 20: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ వారం ఒడిదుడుకులకు అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముగుస్తున్న డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు, పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, పార్లమెంట్ సమావేశాలు మదుపరుల పెట్టుబడులను ప్రభావితం చేయనున్నాయని మార్కెట్ వర్గాలు విశే్లషిస్తున్నాయ. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్)గాను వివిధ ప్రభుత్వరంగ, ప్రైవేట్‌రంగ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు చివరి దశకు చేరుకోవడంతో మదుపరులపై నోట్ల రద్దు అధికంగా ప్రభావం చూపే వీలుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. అయతే లార్సెన్ అండ్ టూబ్రో తదితర భారీ సంస్థలు తమ ఆర్థిక ఫలితాలు ప్రకటించాల్సి ఉండటంతో వాటి ప్రభావం సహజంగానే మదుపరుల పెట్టుబడులపై ఉంటుందని అంటున్నారు. మరోవైపు నల్లధనం, నకిలీ కరెన్సీ నిర్మూలనకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు దేశీయ మార్కెట్లనూ ప్రభావితం చేస్తున్నది తెలిసిందే. బ్యాంకుల్లో పెద్ద ఎత్తున పాత నోట్లు డిపాజిట్ అవుతున్నప్పటికీ, వాటి స్థానంలో కొత్త నోట్ల మార్పిడి వేగంగా జరగకపోవడం, ముఖ్యంగా 100 రూపాయల నోట్ల చెలామణి తగ్గి వ్యాపారాలు స్తంభించిపోవడం మదుపరులనూ కలవరపెడుతోంది. దీంతో ద్రవ్యవ్యవస్థలోకి పెరిగే కొత్త నోట్లతోనే మార్కెట్లు లేవడమా? పడిపోవడమా? అనేది తెలుస్తుందని నిపుణు లు పేర్కొంటున్నారు. మరోవైపు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ విధానాలూ మదుపరుల పెట్టుబడులపై ప్రభావం చూపనున్నాయ. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే ఆ దేశానికేగాక, ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని మెజారిటీ మదుపరులు ఎన్నికల సమయంలో పెట్టుబడులను లాగేసుకున్నది తెలిసిందే. ఫలితంగా భారత్‌సహా అన్ని ప్రధాన దేశాల మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయ. అయతే ట్రంప్ గెలవడం, ఆ తర్వాత ఆయన చేసిన ప్రసంగం మదుపరులను ఆకట్టుకోవడంతో పరిస్థితి కొంత మెరుగైంది. కానీ ప్రస్తుత ట్రంప్ విధానాలు మళ్లీ భయాందోళనలకు దారితీస్తున్నాయ. ఇకపోతే ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, విదేశీ స్టాక్ మార్కెట్ల కదలికలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయ. ముఖ్యంగా రూపాయ మారకం విలువ అన్నింటికంటే అధికంగా దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రూపాయ విలువ గడచిన పక్షం రోజుల్లో భారీగా పతనమైనది తెలిసిందే. దీంతో మరింతగా క్షీణిస్తే ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై కచ్ఛితంగా కనిపిస్తుంది. దీంతో మదుపరులు ఫారెక్స్ ట్రేడింగ్‌పైనా దృష్టి సారిస్తారని మెజారిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.