S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రచ్ఛన్నయుద్ధం చేసే పాక్‌తో సయోధ్యా ?

హైదరాబాద్, నవంబర్ 20: అత్యాధునిక ఆయుధాలతో నిత్యం ప్రచ్ఛన్నయుద్ధం చేస్తూ, భారత్‌పై దుష్ప్రచారం చేస్తున్న పాకిస్థాన్‌తో చర్చలు కానీ, సయోధ్య కాని ఎంత మాత్రం అవసరం లేదని, పాక్ పని అయిపోయిందని ‘సోషల్‌కాజ్’ సంస్థ ఆదివారం ఉదయం నిర్వహించిన సదస్సులో పలువురు వక్తలు పేర్కొన్నారు. ‘ 1965-1971 యుద్ధాలు, భారత్ భద్రతా వ్యవస్థపై చూపుతున్న ప్రభావం’ అనే అంశంపై జరిగిన సదస్సులో గత 60 ఏళ్లుగా ఏదో ఒక రూపంలో యుద్ధం చేస్తూ గెలుపొందడం అసంభవమని తెలిసి కూడా పాక్ తన ధోరణి మార్చుకోలేదని, అలాంటి దేశంతో సామరస్యం ఏమిటని వక్తలు ప్రశ్నించారు. 1965, 1971 యుద్ధాల్లో పాల్గొన్న ఆర్మీ ఉన్నతాధికారులు, భారత యుద్ధ వీరుల సంఘం ప్రధాన కార్యదర్శి మేజర్ జనరల్ ధృవ్ సి కటోచ్, ‘ఆర్గనైజర్’ పత్రిక సంపాదకుడు ప్రఫుల్ల కేత్కర్, నెహ్రూ యువ సంఘటన వైస్ చైర్మన్ పేరాల చంద్రశేఖరరావు, కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, సోషల్ కాజ్ సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ సుశీల సహా పలువురు విద్యావేత్తలు,నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పద్మనాభయ్య మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి పాక్ ఏదో రకంగా యుద్ధం చేస్తూనే ఉందని, భారత్‌లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాక్‌తో సంబంధాలు, కాశ్మీర్ అంశం పెనుసవాలుగా మారిందని చెప్పా రు. మన దేశం ఎంతగా ప్రయత్నిస్తున్నా శాంతి సామరస్యంగా ఉండేందుకు పాక్ కలిసి రావడం లేదని, అలాంటి దేశంతో చర్చలు జరపాలనుకోవడం వృధా ప్రయాస అని అన్నారు. కాశ్మీర్ విషయంలో ప్రభు త్వం స్పష్టమైన వైఖరిని ప్రదర్శించిన ప్రతిసారీ చర్చలు విఫలమవుతునే ఉన్నాయని, అంటే పాక్ వైఖరి ఏమిటో తెలుస్తూనే ఉందని అన్నారు.
భారత అమర వీరుల సంఘం ప్రధానకార్యదర్శి మేజర్ జనరల్ ధృవ్ సి కటోచి మాట్లాడుతూ ఎన్నిసార్లు దెబ్బతిన్నా పాక్ ఏదో ఒక రకంగా కయ్యానికి తలపడుతూనే ఉందని, అలాంటి దేశంతో సాంస్కృతిక- సాంఘిక సంబంధాల్లో అర్థంలేదన్నారు. 1962లో చైనా భారత్‌పై దాడి చేసినపుడు కాశ్మీర్‌ను కబళించాలని పాక్ ప్రయత్నించిందని, 1965లోనూ అదే కుత్సితంతో వ్యవహరించినా మన సైన్యం గట్టిగా బదులిచ్చిందని అన్నారు. 1965 యుద్ధం భారతీయుల నైతిక స్థైర్యాన్ని పెంచగా, 1971 యుద్ధం ఘనవిజయానే్న తెచ్చిందని, పాక్ కుట్రలను, కుతంత్రాలను ముందుగానే పసిగట్టడంలో మన నిఘా వ్యవస్థ అనుకున్నంత సమర్థంగా పనిచేయడం లేదన్నారు. ప్రస్తుతం సైనికులకు అండగా నిలిచే దృఢమైన నాయకత్వం దేశంలో ఉందని నెహ్రూ యువ సంఘటన వైస్ చైర్మన్ పేరాల చంద్రశేఖరరావు చెప్పారు. కాశ్మీర్ భూభాగానికి సంబంధించి పాక్ నిరంతరం అసత్య ప్రచారం చేస్తోందని, అయితే పాక్ కథనాలకు సవ్యమైన రీతిలో తిప్పికొట్టే ప్రయత్నాలు మరింత ముమ్మరం కావాలని ‘ఆర్గనైజర్’ పత్రిక సంపాదకుడు ప్రుఫుల్ల కేత్కర్ అన్నారు. కాశ్మీర్ పట్ల మనకు న్యాయబద్ధమైన అధికారం ఉందని, కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేస్తూ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ కూడా తీర్మానం చేసిందన్నారు.
ఈ సందర్భంగా మేజర్ జనరల్ కటోచ్ సంకలనం చేసిన రెండు గ్రంథాలను ఆవిష్కరించారు. 1971 యుద్ధంలో పోరాడిన గ్రూప్ కెప్టెన్ దిలీప్ కుమార్ దాస్, వింగ్ కమాండర్ మెహతా ఫరూక్, వింగ్ కమాండర్ రవీందర్ సింగ్ , కెప్టెన్ నగుర్‌పల్లి నర్సింహరావు, బ్రిగేడియర్ మధురాంతకం రవీంద్రనాధ్,రేర్ అడ్మిరల్ కెకె పేస్తోంజి, వింగ్ కమాండర్ అశోక్, లెఫ్టినెంట్ కల్నల్ నరేంద్రకుమార్ తదితరులను సోషల్ కాజ్ సంస్థ సత్కరించింది.