S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పోలవరం ప్లాంట్‌కు శ్రీకారం

హైదరాబాద్, నవంబర్ 20: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం కుడికాల్వ గట్టుపై ఐదు మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్‌ను సోమవారం ప్రారంభిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామం వద్ద ఈ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారు. ఈ ప్లాంట్ ద్వారా సాలీనా 8.06 ఎంయు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.37.58 కోట్లు ఖర్చయింది. ఈ ప్లాంట్ నిర్మాణానికి 37 ఎకరాలను సేకరించారు. ఈ ప్రాజెక్టుకు కాంట్రాక్టును 2015 డిసెంబర్ 8వ తేదీన కేటాయించారు. ఈ సందర్భంగా ఏపి ట్రాన్స్‌కో విజయానంద్ రాష్ట్రంలో విద్యుత్ పరిస్ధితిని వివరించారు. 2022 నాటికి 10వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ఉత్పత్తి చేస్తామన్నారు. కేంద్రం జాతీయ స్థాయిలో లక్ష మెగావాట్ల సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. తక్కువ ఖర్చుతో సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం సౌర విద్యుత్ కెపాసిటీ 1000 మెగావాట్లు ఉందన్నారు. 2017 మార్చి నాటికి ఈ సామర్థ్యం రెండు వేల మెగావాట్లకు పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో నాలుగు వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చామన్నారు. అనంతపురం జిల్లాలో రెండు వేల మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు. కర్నూలు, కడప జిల్లాల్లో వెయ్యి మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 2019నాటికి ఈ ప్రాజెక్టులను దశల వారీగా పూర్తిచేస్తామన్నారు. 2017 మార్చి నాటికి కర్నూలు జిల్లాలో వెయ్యి మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పార్కు ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్రంలో 2500 మెగావాట్ల సోలార్, 2500 మెగావాట్ల పవన విద్యుత్ రంగం ప్రాజెక్టుల ఏర్పాటుకు రూ.20 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయన్నారు.