S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మెడికల్ టూరిజంపై భారీ ప్రభావం

హైదరాబాద్, నవంబర్ 20: కేంద్రం రద్దు చేసిన పెద్ద నోట్ల ప్రభావం మెడికల్ టూరిజంపై పడింది. హైదరాబాద్‌కు పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల నుంచి పెద్ద ఎత్తున రోగులు ఇక్కడ ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు వస్తుంటారు. భాషాపరమైన సమస్య లేకపోవడం, తక్కువ ఖర్చులో వైద్యం, వసతి సదుపాయాలు, వైద్య నిపుణులు ఉండడం తదితరకారణాల వల్ల ఇక్కడకు విదేశాల నుంచి ఎక్కువ మంది రోగులు వస్తుంటారు. ఈ నెల 8వ తేదీన పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేయడంతో, అత్యవసరమైన వైద్య చికిత్స అవసరమైన రోగులే రావాలని కోరుతున్నట్లు అపోలో ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. డిసెంబర్ 30వ తేదీ వరకు చిల్లర నోట్ల కొరత, నోట్ల మార్పిడి సమస్య ఉంటుందని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు భావిస్తున్నాయి. పశ్చిమాసియా నుంచి వచ్చే రోగులు ఎక్కువగా కార్డు ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తుంటారు.
ఆఫ్రికా నుంచి వచ్చే రోగులు కరెన్సీ మార్పిడి చేసుకుని వైద్య చికిత్స సేవలు పొందుతుంటారు. ప్రస్తుతం రోగులతో పాటు వచ్చిన సహాయకులు ఆసుపత్రి క్యాంటీన్లలోనే భోజన సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆస్పత్రి యాజమాన్యాలు కోరాయి. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో అపోలో ఆసుపత్రులు ఉన్నాయి. ఒక్క ఈ ఆసుపత్రిలోనే గత ఏడాది 1.5 లక్షల మంది విదేశీయులు వైద్య చికిత్సలు చేయించుకున్నారు. ఇన్‌పేషెంట్లగా చేరిన విదేశీ రోగుల కంటే ఐదారు రోజుల పాటు ఉండి వైద్య చికిత్స చేయించుకుని వెళ్లాలనుకునే విదేశీ రోగులు ఎక్కువ కష్టాలు పడుతున్నారు. వీరు బయట హోటళ్లలో రూంలు తీసుకుని మెస్‌లు, హోటళ్లలో భోజనం చేస్తుంటారు. వీరంతా నోట్ల మార్పిడి, చిల్లర కొరత సమస్యలను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఎల్‌వి ప్రసాద్ నేత్ర చికిత్స సంస్ధకు కూడా పెద్ద ఎత్తున విదేశాల నుంచి రోగులు వస్తుంటారు. ఈ ఆసుపత్రికి ప్రతి రోజూ 80 మంది రోగులు వివిధ దేశాల నుంచి వస్తుంటారు. భారతదేశానికి వచ్చే మెడికల్ టూరిస్టుల్లో 10 శాతం మంది హైదరాబాద్‌కు వస్తుంటారు.