S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంక్షేమానికి ‘పెద్ద’ గండి

న్యూఢిల్లీ, నవంబరు 20: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల రాష్ట్రాలలో సమస్యలు ఉత్పన్నమయ్యయని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాల ఆర్థికమంత్రులు కేంద్రానికి వివరించారు. జీఎస్టీ పన్ను కేటాయింపులపై కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడానికి ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీ నేతృత్వంలో ఆదివారం నాడు ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. అనంతరం మంత్రి ఈటల విలేఖరులతో మాట్లాడుతూ జీఎస్టీ పన్ను వసూళ్లపై రాజకీయ పరిష్కారం కోసం రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు. ఆదివారం జరిగిన సమావేశంలో పన్ను కేటాయింపులే ప్రధాన అజెండా అయినప్పటికీ, నోట్ల రద్దు అంశంపైనే చర్చ జరిగిందని వెల్లడించారు. పన్ను వసూళ్లపై ఎలాంటి ఏకాభిప్రాయం సాధించకుండానే సమావేశం అసంపూర్తిగా ముగిసిందన్నారు. ప్రధానంగా కోటిన్నర టర్నోవర్ కలిగిన సంస్థల, వ్యవస్థలను రాష్ట్రాల పరిధిలోకి, కోటిన్నరకు పైగా టర్నోవర్ అదాయం కలిగిన వాటిని కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్రాలు కోరినట్లు వెల్లడించారు. దీనిపై ఎటువంటి ఏకాభిప్రాయం కుదరకుండానే ఈ సమావేశం ముగిసిందన్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్రాల అధికారులతో ఈ నెల 25న జరిగే సమావేశానికి నిర్దిష్టమైన గణాంకాలతో మరోసారి రావాలని కేంద్రమంత్రి సూచించినట్లు తెలిపారు. పెద్దనోట్ల రద్దు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపుతోందని, వేలాది కోట్ల నష్టం జరిగిందని ఈ సమావేశంలో తెలియజేశామన్నారు. ఉద్యోగుల జీతభత్యాలపై ప్రభావం చూపబోదని, ప్రాజెక్టులపై ఇతర సంక్షేమ పథకాలపై ఉంటుందని వెల్లడించారు. పెద్దనోట్ల మార్పిడిలో సహకార బ్యాంకులను కూడా భాగస్వామ్యం చేయాలని కేంద్రమంత్రిని కోరామన్నారు.