S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కవులు, కళాకారులకు కాణాచి సిద్దిపేట

సిద్దిపేట, నవంబర్ 20: కళలకు కాణాచి సిద్దిపేట అని.. కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రతిభగల క్రీడాకారులను ప్రోత్సహిస్తే భవిష్యత్‌లో అత్యుత్తమ కళాకారులుగా ఎదుగుతారన్నారు. కాపురాజయ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కాపు చిత్రలేఖ చిత్రకళలో తన తాతయ్యను మించిపోవాలని మంత్రి ఆకాంక్షించారు. సిద్దిపేట కళాభవన్‌లో ఆదివారం రాత్రి కాపురఘు ఫొటో ఎగ్జిబిషన్, చిత్రలేఖ చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 25 ఏండ్ల కిందనే కాపు రఘు అద్భుతమైన ఛాయాచిత్రాలు తీశారని, ఇప్పుడు ఆయన మనమధ్య లేకపోవడం బాధాకరమన్నారు. రఘు జీవించి ఉంటే గొప్పఛాయాచిత్రకారునిగా ఎదిగేవాడన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు ముఖ్యపాత్ర నిర్వహించారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన కళాకారులు, కవులు, మేధావులు, మహామహులు సిద్దిపేట ప్రాంతానికి చెందినవారు ఉండడం గొప్ప విషయమన్నారు. ఆర్కిటెక్ట్ ఇంజనీరింగ్ చదువుతూనే అద్భుతమైన చిత్రాలు ఆవిష్కరించిన చిత్రలేఖ గొప్ప కళాకారిణిగా ఎదిగేందుకు తనవంతు సహకారం అందిస్తానన్నారు. చిత్రలేఖ తన పేరుకు తగ్గట్టుగానే చిత్రకళలో ఎదుగుతుందని నమ్మకం ఉందన్నారు. సిద్దిపేటను సాహితీరంగంలో వేముగంటి, చిత్రకళలో కాపురాజయ్య రెండు కళ్లలాంటి వారన్నారు. వారి విగ్రహాలను కాపు రాజయ్య జయంతి ఏప్రిల్ 7న కోమటిచెరువు వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. వేముగంటి నర్సింహాచారి విగ్రహం ఎర్రచెరువు వద్ద ఏర్పాటు చేస్తామని సభాముఖంగా ప్రకటించారు. నంది అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి, గాయకులు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ కాపురాజయ్య చిత్రకళతో సిద్దిపేట పేరును అంతర్జాతీయస్థాయిలో ఇనుమడింప చేశారని కొనియాడారు. చిత్రలేఖ చిత్రకళలో తాతపేరు నిలపెట్టేందుకు కృషి చేయాలన్నారు. హైదరాబాద్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది కళాకారులు కళను నమ్ముకొని జీవిస్తున్నారని, కళాకారులకు స్థలం కేటాయిస్తే ఈ ప్రాంతంలో కళాభవన్‌ను ఆవిష్కరిస్తామన్నారు. సిద్దిపేటలో కళా ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలన్నారు.
ఆకట్టుకున్న ఛాయాచిత్ర, చిత్రకళ ప్రదర్శన
కళాభవన్‌లో ఏర్పాటు చేసిన కాపురఘు ఫొటో ఎగ్జిబిషన్, చిత్రలేఖ చిత్రకళ ప్రదర్శన ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. మంత్రి హరీశ్‌రావు ఫోటో, చిత్రకళ ప్రదర్శనను చూసి మంత్రముగ్ధులై చిత్రలేఖను అభినందించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రాజనర్సు, రాధాకిషన్‌శర్మ, నర్సారెడ్డి, కాపురమేశ్, గౌరీశంకర్, చిత్రలేఖ తదితరులు మాట్లాడారు.