S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సహకార బ్యాంకు ఖాతాదారుల హాహాకారాలు!

నల్లగొండ, నవంబర్ 20: సహకార బ్యాంకుల ద్వారా పాతనోట్ల మార్పిడి ప్రక్రియను ఆర్‌బిఐ అనుమతించకపోవడంతో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల పరిధిలోని లక్ష 95 వేల మంది ఖాతాదారులు, 87 వేల మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటా 1000 కోట్ల వార్షిక లావాదేవిలు సాగిస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి నేడు ఖాతాదారులకు, సిబ్బందికి వేయి రూపాయలైనా ఇవ్వలేని దుస్థితిలో పడింది. దేశంలోని సహకార బ్యాంకులన్ని ఆన్‌లైన్ కాకపోవడం, బిహార్‌లో మాన్యువల్‌గా లావాదేవీలు సాగిస్తున్న సహకార బ్యాంకులు ఒకేరోజు 120 కోట్ల పాతనోట్ల డిపాజిట్‌లతో సాగించిన నిర్వాకం దేశంలోని సహకార బ్యాంకుల్లో పాతనోట్ల మార్పిడి సాగకుండా ఆర్‌బిఐ నిషేధం విధించింది. అదీగాక సహకార బ్యాంకులు రాజకీయ పాలకవర్గాలు, వారి సంబంధీకుల నిర్వహణలో సాగుతున్నందున పాతనోట్ల మార్పిడికి అవకాశమిస్తే దుర్వినియోగమే అధికమని భావిస్తోంది. అయితే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని సహకార బ్యాంకులు ఇప్పటికే ఆన్‌లైన్ ఆర్‌బిఐ సిస్టమ్‌లోకి మారినందున ఈ రాష్ట్రాల సహకార బ్యాంకుల్లో పాతనోట్ల మార్పిడికి అవకాశం కల్పించాలంటూ ఖాతాదారులు, ఉద్యోగులు ఆందోళన సాగిస్తున్నారు. ఈ సమస్యపై తెలంగాణ సిఎం కెసిఆర్ సైతం ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ భేటీలో సైతం విన్నవించారు. సహకార బ్యాంకుల్లో ఖాతాదారులు రైతులు, గ్రామీణ రైతు కూలీలు, గొర్రెలు, మేకల పెంపకందారులు, గ్రామీణ కులవృత్తిదారులు, చేనేత కార్మికులు, చిరువ్యాపారులే అధికంగా ఉండటంతో పాతనోట్ల మార్పిడి నిషేధం ఆ వర్గాలకు పెద్ద దెబ్బగా మారింది. పంటల సాగు పెట్టుబడులకు, కుటుంబాల అవసరాలకు సహకార బ్యాంకు ఖాతాదారులైన రైతులు నానాపాట్లు పడుతున్నారు. సహకార బ్యాంకుల్లో పాతనోట్ల మార్పిడి, డిపాజిట్లు, చెల్లింపులకు అవకాశమివ్వాలంటూ ఈ నెల 25న సిబ్బంది, రైతులు దేశవ్యాప్తంగా ఆందోళన చేయనుండటం సమస్య తీవ్రతను చాటుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి) పరిధిలో మూడు జిల్లాల్లో 30 బ్రాంచీలున్నాయి. అందులో లక్షా 95వేల మంది ఖాతాదారులుండగా వారిలో 87వేల మంది ఖాతాదారులు రైతులే ఉన్నారు. పాతనోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తొలి మూడురోజుల్లో 36 కోట్ల పాతనోట్లు ఆయా సహకార బ్యాంకు బ్రాంచీల్లో జమయ్యాయి. ఆర్‌బిఐ నిర్ణయంతో వారికి తిరిగి చెల్లింపులు చేయలేని పరిస్థితిలో సహకార బ్యాంకులు ఇరుక్కుపోయాయి. ప్రస్తుతం డిసిసిబి ఇతర కమర్షియల్ బ్యాంకుల్లో చేసిన 5 కోట్ల డిపాజిట్లను సైతం ఆ బ్యాంకులు ఇవ్వడానికి నిరాకరించడం సహకార బ్యాంకు కష్టాలను మరింత జటిలం చేసింది. బ్యాంకు పరిధిలోని బ్రాంచ్‌లకు చెందిన 225 మంది ఉద్యోగులకు ఈ నెల జీతాలు కనీసంగా టిఏ, డిఏలు సైతం చెల్లించలేని పరిస్థితి నెలకొంది. చెస్ట్ (మాతృ) బ్యాంకులైన ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్‌లు సహకార బ్యాంకులకు నిధుల విడుదల నిలిపివేయడం మరింత సమస్యగా మారింది. దీంతో తమవద్దకు నగదు విత్‌డ్రా కోసం వస్తున్న ఖాతాదారులను సదరు బ్యాంకుల వద్దకే సహకార బ్యాంకు సిబ్బంది సిఫారస్తు చేస్తున్నారు. డిసిసిబికి డిపాజిట్ల సమస్యతో రుణమాఫీ కింద రైతులకు మంజూరైన మొత్తాలను కూడా వారికి బదలాయించలేని క్లిష్ట పరిస్థితి నెలకొంది. అటు పాతనోట్ల మార్పిడికి అనుమతిస్తే 275 కోట్ల రుణాలను రైతులు చెల్లించినట్లయితే రుణ బకాయిల వసూళ్లతో పాటు పంట రుణాల రీషెడ్యూల్‌కు, కొత్త రుణాల మంజూరుకు అవకాశముంది. వందేళ్ల చరిత్ర ఉన్న సహకార బ్యాంకులతోనే జనాభాలో అధికశాతమైన గ్రామీణ ప్రజలు రైతులు లావాదేవీలు సాగుతుండటం నిర్వివాదాంశం. ఈ నేపధ్యంలో రైతులు, రైతు కూలీలు, గ్రామీణ పేదలు, చిరువ్యాపారులు అధికంగా వినియోగించే సహకార బ్యాంకుల్లో ఆన్‌లైన్ అయన శాఖల వరకైనా పాతనోట్ల మార్పిడికి అవకాశం కల్పించడం ద్వారా ఆర్‌బిఐ ఆ వర్గాలకు పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన సమస్యల పరిష్కారం చూపాలని రైతు సంఘాలు, రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో కోరుతున్నాయి.