S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆస్తి పన్నులో నంబర్ వన్ హైదరాబాద్

హైదరాబాద్, నవంబర్ 20: పాత నోట్లతో ఆస్తి పన్ను వసూలు చేయడంలో దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. పాత నోట్లతో ఆస్తి పన్ను వసూలుతో హైదరాబాద్ దేశంలోని ఇతర నగరాల కన్నా ముందు వరుసలో నిలిచినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సమీక్షలో తేలింది. నవంబర్ నెలలో 188 కోట్ల రూపాయలను వసూలు చేయడం ద్వారా మూడింతల ఆదాయం పొందిందని కేంద్రం ప్రశంసించింది. మొత్తం 22 నగరాల్లో మహారాష్ట్ర కళ్యాణ్ నగర్ 170 కోట్లు వసూలు చేసి రెండవ స్థానంలో, 150 కోట్లతో అహ్మద్ నగర్ మూడవ స్థానంలో, 76.8 కోట్లతో చెన్నై నగరం నాలుగవ స్థానంలో నిలిచాయి. 2015 నవంబర్‌లో కేవలం 8 కోట్ల రూపాయలను వసూలు చేసిన జిహెచ్‌ఎంసి, పాత నోట్లతో 2016 నవంబర్ పదవ తేదీ నుండి 19వ తేదీ వరకు 190 కోట్ల రూపాయల పన్ను వసూలు చేసింది. ఇది 2350 శాతం పురోగతి. పాత నోట్లతో పన్ను చెల్లించే విధానాన్ని జిహెచ్‌ఎంసి పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంది.
విశాఖపట్నం 15.4కోట్లు, కాకినాడ 20 కోట్లు, విజయవాడ 12 కోట్లు, గుంటూరు 6 కోట్లు, తిరుపతి 4.43 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆస్తి పన్ను వసూళ్లలో దేశంలో మొదటి స్థానంలో నిలిచినందుకు జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈనెల 24వ తేదీ వరకు పాత నోట్లతోనే పన్ను వసూలు చేస్తారు.