S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రశాంతంగా ఎస్సై పోస్టుల పరీక్ష

హైదరాబాద్, నవంబర్ 20: తెంలగాణ పోలీసు శాఖ సబ్ ఇన్‌స్పెక్టర్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు (ఎస్పీఎఫ్)లో ఎస్సై(మెన్స్), ఆగ్నిమాపక శాఖలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్(ఎస్‌ఎఫ్‌ఓ) పోస్టులతో పాటు ఎస్సై(కమ్యూనికేషన్/ పిటిఓ) పోస్టులకు తుది పరీక్షలు రెండో రోజు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఫస్ట్ పేపర్(అర్థిమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్) పరీక్షను రిక్రూట్‌మెంట్ బోర్డు గట్టి భద్రతల నడుమ నిర్వహించింది. దేహదారుఢ్య పరీక్షల్లో నెగ్గి తుది రాత పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 13వ తేదీ ఉదయం 11గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా ఈనెల 26న కానిస్టేబుల్ కమ్యూనికేషన్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించనున్నట్టు రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం గం. 2.00ల నుంచి సాయంత్రం గం. 5.00ల వరకు జరిగే పరీక్షకు 5వేల మంది అభ్యర్థులు తీతీతీ.ఆఒఔఇ.జశవెబ్‌సైట్ ద్వారా ఈనెల 21 మధ్యాహ్నం గం. 2.00ల నుంచి 23వ తేదీ అర్ధరాత్రి వరకు హాల్ టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.

చిత్రం.. పరీక్ష రాస్తున్న ఎస్‌ఐ అభ్యర్థులు