S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఏబిసిడి వర్గీకరణకు సంపూర్ణ మద్దతు: గద్దర్

వనస్థలిపురం, నవంబర్ 20: ఏబిసిడి వర్గీకరణకు తన సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు ప్రజా గాయకుడు గద్దర్ ప్రకటించారు. ఆదివారం డప్పుకు చెప్పుకు రూ.2000 పింఛన్ ఇవ్వాలని, వచ్చే పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఎల్బీనగర్‌లోని ఎస్కేడీ ఫంక్షన్ హాల్‌లో ఎంఆర్‌పిఎస్ తెలంగాణ రాష్ట్ర సర్వ సభ్య సమావేశం నిర్విహించారు. రాష్ట్ర అధ్యక్షుడు యతాకుల భాస్కర్ మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశానికి గద్దర్ ముఖ్యఅతిథిగా హాజరైనారు. మాదిగ ఉపకులాల అభివృద్ధికి చేస్తున్న ఈ పోరాటంలో అన్ని కులాల నాయకులను ఒక్క తాటి పైకి తీసేకొచ్చి ఐక్యమత్యంతో ముందుకెళ్లాలని చెప్పారు. ఈ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో బృహత్తరమయిన మార్పులను తీసుకొస్తుందని గుర్తు చేశారు. చెప్పు, డప్పు పింఛన్ అనేది మాదిగ జాతుల రాజ్యంగ హక్కని, కులవృత్తులకు పింఛన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. వర్గీకరణ పోరాటంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండ పెద్దల సమక్షంలో కూర్చోని మాట్లాడి చర్చించి అందరు ఒక్కతాటిపైకి రావాలని సలహా ఇచ్చారు. ఎలాంటి ఒత్తిడిలకు తావు లేకుండా ఆత్మ గౌరవం కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ప్రాణత్యాగాలకు కూడ వెనకంజ వేయవద్దని గద్దర్ పిలుపునిచ్చారు. ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర శాఖ కార్యనిర్వాహణ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాట్లడుతూ ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విధంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచాలని, లిడ్‌క్యాప్‌ను అభివృద్ధి చేసి మాదిగ యువతకు ఉపాధి కల్పించాలని కోరారు.
ఈనెల 24న చలో ఢిల్లీ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి మాదిగలతో పాటు మాదిగ ఉపకులాలు పెద్దఎత్తున తరలి రావాలని పిలుపు నిచ్చారు. పాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ ఉప కులాల నుంచి చక్కటి స్పందన లభించిందని, తన జాతి అభివృద్ధి కోసం ఎంతటి ప్రాణ త్యాగానికయిన వెనకంజ వేసేది లేదని శ్రీనివాస్ చెప్పారు. సమావేశంలో ఎంఆర్‌పిఎస్ జాతీయ అధ్యక్షుడు సుంకపాక దేవయ్య, జాతీయ గౌరవ అధ్యక్షుడు సుడ్రపల్లి వెంకటయ్య, ఎల్బీనగర్ ఎంఆర్‌పిఎస్ అధ్యక్షుడు వంటెపాక శంకర్, మేడి పాపయ్య పాల్గొన్నారు.