S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కరెన్సీ రద్దుపై కేంద్రాన్ని ప్రాసిక్యూట్ చేస్తాం

ముషీరాబాద్, నవంబర్ 20: కరెన్సీ రద్దుతో ప్రజల ప్రాణాలు కోల్పోవటానికి కారణమైన ప్రధాని నరేంద్ర మోదీ, దేశ ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లి, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, రిజర్వు బ్యాంక్ గవర్నర్, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిలను ప్రాసిక్యూట్ చేయాలని దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో లీగల్ నోటీసులు జారీ చేస్తున్నామని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్, పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు చేపూరి రాజు, వీసం రాములు వెల్లడించారు. ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ ఐపిసి ప్రకారం దేశవ్యాప్తంగా 55 మంది పౌరులు తమ ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి మరణాలకు కేంద్ర మంత్రులు, ఇతర అధికారులు బాధ్యత వహించాలని అన్నారు. భారత రాష్టప్రతి, సుప్రీంకోర్టులకు తమ పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేస్తున్నామని అన్నారు. కరెన్సీ రద్దు ప్రకటనతో పౌరులు ప్రాణాలు కోల్పోతుంటే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. రాజ్యాంగ హక్కుల్ని, ప్రాథమిక, ఆస్తి హక్కులను ప్రధాని కాలరాసారని చెప్పారు. తీవ్ర సమస్యలతో ప్రజలు సహనాన్ని కోల్పోతున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థల్ని కుప్పకూల్చే విధంగా ఆరెస్సెస్ ఆలోచనాప్రకారం బిజెపి ప్రభుత్వం కరెన్సీని హఠాత్తుగా రద్దు చేసిందని ధ్వజమెత్తారు. భారత మంత్రులు చేసిన ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలపై లాటిన్, అమెరికా, సౌదీ రాజ్యాలలోనైతే ప్రభుత్వ అధినేతలను ప్రజలు తగు గుణపాఠం చెప్పేవారని అన్నారు. లీగల్ నోటీసులు జారీ చేసిన 15 రోజుల్లోగా కేంద్ర మంత్రి మండలి నుండి తగు సమాధానం రాకపోతే పార్టీ ఆధ్వర్యంలో హైకోర్టులో ప్రాసిక్యూట్ చేస్తామని అన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.50 లక్షల చొప్పున నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.