S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మాల సంక్షేమ సంఘం గ్రేటర్ ప్రధాన కార్యదర్శిగా అవినాష్‌కాంత్

హైదరాబాద్, నవంబర్ 20: రాష్ట్ర మాల సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శిగా దార్ల అవినాష్‌కాంత్ నియమితులయ్యారు. ఆదివారం సంఘం కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ ఆయనకు నియామక ఉత్తర్వులను అందజేశారు. బత్తుల రాంప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగ ఆర్పాటు చేసిన 31 జిల్లాల్లో సంఘం నూతన కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల సంక్షేమ పథకాలు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలు తీరు, ఎస్సీ సబ్‌ప్లాన్ చట్టం నిర్వీర్యం చేసే విధంగా చర్యలు చేపడుతున్న ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. ఎస్సీ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాలని అందుకు మాలలందర్నీ చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత సంఘంలోని ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. కొత్తగా ఏర్పడిన గ్రేటర్ కమిటీ 15రోజుల్లో హైదరాబాద్ పరిధిలో ఉన్న రెండు రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలకు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకాలు చేపట్టాలని కోరుతూ, కమిటీ ద్వారా వచ్చే నెల 6వ తేదీన గ్రేటర్ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పదవీతో సభ్యుల బాధ్యత మరింత పెరిగిందని, ఇదే కోణంలో మిగతా 30 జిల్లాల్లోని రెవెన్యూ డివిజన్, రెవెన్యూ మండల కమిటీలను ర్పాటు చేయాలన్నారు. అనంతరం గ్రేటర్‌కు నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దార్ల అవినాష్‌కాంత్ మాట్లాడుతూ ప్రధాన కార్యదర్శిగా గ్రేటర్‌లో మాలలందర్నీ ఐక్యం చేసి, ఎస్సీ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి బి. మురళీకిషన్, ఉద్యోగ విభాగం అధ్యక్షుడు చెట్లపల్లి అరుణ్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండా కిరణ్‌కుమార్, గ్రేటర్ అధ్యక్షుడు సిహెచ్ వినోద్‌కుమార్ పాల్గొన్నారు.