S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రహదారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట

జీడిమెట్ల, నవంబర్ 20: రహదారుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం గండిమైసమ్మ నుండి బాచుపల్లి వరకు సుమారు రూ.15కోట్ల నిధులతో రోడ్డు పనులను జిల్లా మంత్రి పి.మహెందర్‌రెడ్డి, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు సిహెచ్ మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్, ఎమ్మెల్సీ రాజుతో కలిసి తుమ్మల ప్రారంభించారు.
మంత్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా మరిన్ని రోడ్లను అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. పాత రంగారెడ్డి జిల్లాతో పాటు మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో రెండు వేల కోట్ల రూపాయలతో రహదారులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధే ధ్యేయంగా కెసిఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ బి.ప్రభాకర్‌రెడ్డి, ఎంపిడిఓ అరుణ, పలు గ్రామాల సర్పంచ్‌లు ముడిమ్యాల రాముగౌడ్, మంగమ్మ, అనంతస్వామి, శ్రీనివాస్, లక్ష్మి, కావలి గణేశ్, ఎంపిటిసిలు కమలమ్మ, వెంకటేశ్, తలారి యాదగిరి, దయాకర్‌రెడ్డి, రుక్మిణి, కార్పొరేటర్ జగన్ పాల్గొన్నారు.
బహద్దూర్‌పల్లిలో కమ్మసేవా సంఘం భవనం ప్రారంభం
బహద్దూర్‌పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన కమ్మ సేవా సంఘం భవనాన్ని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. కమ్మ కులస్థుల సంక్షేమానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపి సిహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కెపి వివేక్, అరికెపూడి గాంధీ పాల్గొన్నారు.