S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘నాన్న’ ఓ మధుర జ్ఞాపకమే

హైదరాబాద్, నవంబర్ 20: ప్రపంచానికి అందిన ఒక బహుమతి నాన్న అని, నాన్న ఎప్పుడూ ఓ మధుర జ్ఞాపకమేనని డా.బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ సీతారామారావు అన్నారు. ఆదివారం ఆయన సికింద్రాబాద్‌లోని పిజి కళాశాల అంబేద్కర్ అధ్యయన కేంద్రం ఎం.ఏ తెలుగు విద్యార్థులు రచించి రూపొందించిన ‘నాన్న కోసం’ కవితల సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి జీవితాలలో నాన్న ఒక మరపురాని జ్ఞాపకంగా, విలువైన మార్గదర్శనంగా గుర్తుండిపోతారని పేర్కొన్నారు. విద్యార్థులు, కౌన్సిలర్ల కవితా సమ్మేళనంగా రూపుదిద్దుకున్న ఈ పుస్తకం ఎంతో అపురూపమైనదని, నాన్నను విభిన్న కోణాలలో ఆవిష్కరించి కవితలుగా మలిచిన విద్యార్థులను వైస్ ఛాన్స్‌లర్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమానికి తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ ఎన్.రజిని అధ్యక్షత వహించారు. పి.జి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రవీందర్, అధ్యయన కేంద్రం కో-ఆర్డినేటర్ డా.అంజయ్య, కౌన్సిలర్‌లు తిరునగరి శ్రీనివాస్, మునిరత్నం నాయుడు, చికిచర్ల కృష్ణారెడ్డి, పాల్ రత్నాకర్, సుధాకర్ భట్టు, సూరేపల్లి గురునాథం, విద్యార్థి ప్రతినిధులు జగదీష్, రుక్సాన, మల్లేష్, రాం చంద్రారెడ్డి, స్వరూపతో పాటు ఎం.ఏ ప్రథమ, ద్వితీయ విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగు విద్యార్థుల పక్షాన వైస్ ఛాన్స్‌లర్ సీతారామారావును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ తిరునగరి శ్రీనివాస్ పుస్తక సమీక్ష చేశారు.