S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దీపం వెలిగిస్తే అజ్ఞానం దూరం

కాచిగూడ, నవంబర్ 20: దీపం వెలిగించడం వల్ల అజ్ఞానం తొలిగి జీవితంలో వెలుగును నింపుతుందని దత్తపీఠం పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానందస్వామి అన్నారు. భక్తిటివి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దిపోత్సవ కార్యక్రమానికి ఆదివారం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తూ అన్ని యుగాల నుంచి దీపోత్సవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కార్తీక మాసంలో శివుడికి దీపం వెలిగించినప్పుడు జీవితంలో ఉన్న చీకటి దూరం అవుతుందని తెలిపారు. కార్తీక మాసంలో వెలిగించిన జ్యోతి సాక్షత్తు శివుడికి ఆనందయాకమని అన్నారు. పరమాత్ముడి రూపం జ్యోతి రూపంలో ఉందన్నారు. నరేంద్ర చౌదరి నిర్వహిస్తున్న కోటి దిపోత్సవం దిగ్విజయంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. కోటి దిపోత్సవంలో ముందుగా తిరుమల శ్రీనివాస కల్యాణోత్సవం అంగరంగా వైభవంగా వేద పండితులు జరిపించారు. అనంతరం తిరులమ శ్రీనివాస పల్లకీ సేవను ఘనంగా నిర్వహించారు. గణపతి సచ్చిదానందస్వామి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు, నరేంద్ర చౌదరి దంపతులు కార్తీక దీపారాధనలో పాల్గొన్నారు.