S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మూడు తరాల విద్యావేత్త చుక్కా రామయ్య

హైదరాబాద్, నవంబర్ 20: మూడు తరాలకు విద్యను అందించిన విద్యావేత్త చుక్కా రామయ్య తెలంగాణ ఉద్యమంలో ముందుండి అందరిని నడిపించారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అన్యాయాన్ని, అధర్మాన్ని సహించని వ్యక్తిగా చుక్కా రామయ్యను ఆ కాలంలోనే కాదు ఈ కాలంలో కూడా పాదాలకు నమస్కరించే వారని ఆయన అన్నారు. ఈనాటి మేధావులు ఎందరో ఆయన శిష్యరికం నుండి వచ్చిన వారేనని, తనకు కూడా ఫిజిక్స్‌లో పాఠాలు చెప్పారని బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ, గురుతుల్యులు చుక్కా రామయ్య జన్మదినోత్సవం సందర్భంగా ఆదివారం తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరిగిన విద్యా సదస్సుకు దత్తాత్రేయ విశిష్ట అతిధిగా పాల్గొని శాలువాతో చుక్కా రామయ్యను సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏపి శాసనమండలి చైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ ప్రవహించే జీవనది చుక్కా రామయ్య అని అన్నారు. ఆయన కాలు పెట్టిన ఏ ప్రదేశమైనా విద్యావేదిక అవుతుందని, సమాజమే ఆయన కుటుంబమని చక్రపాణి అన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో వున్నప్పటికి సమాజం గురించి ఆలోచించదని, సమాజ సంస్కర్తగా చుక్కా రామయ్యను అభివర్ణించారు. ఈయన శిష్యులలో ఎంతోమంది ఐఎయస్‌లు, ఐపిఎస్‌లుగా ఉన్నత ఉద్యోగాలలో ఉన్నారని, చైతన్యవంతమైన సమాజానికి చుక్కా రామయ్య ఆదర్శంగా ఉండాలని, అందరివాడు, అందరికి అందుబాటులో ఉండేవాడని, ఈ తరానికి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి వారని చక్రపాణి కొనియాడారు. ప్రొ.కోదండరామ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మిత్రుడిలా అందరికి అందుబాటులో వున్న చుక్కా రామయ్య జీవితం నుండి ఈ తరం తెలుసుకోవాల్సింది ఎంతో ఉందని అన్నారు. అణగారిన పేదవారికి విద్య నేర్పించాలని ఉద్యమంలో విద్యాబోధన చేపట్టి వారిని ఉత్తేజ పరిచారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు పెంచాలని, నమ్మకమైన విద్యను అందించాలని అన్నారు. కారణాలు ఏవైనా ఇటీవల పదివేల మంది విద్యార్థులను డిటైన్ చేసేవారని, ఆ పరిస్థితి ఎందుకు కలిగిందని సమీక్షించాల్సిన అవసరముందని ప్రభుత్వానికి కోదండరామ్ సూచించారు. ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ఐఐటిని ఏర్పాటుచేయించిన చుక్కా రామయ్య అందరికి ఐఐటి రామయ్యగా ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఆ మహనీయుడు తెలంగాణ గడ్డపై పుట్టడం మన అదృష్టమని, సామాజిక స్పృహతో ఆయన పాఠాలు చెప్పేవారని, విద్యా వ్యవస్థలో కొత్త మార్పులు చేస్తూ చుక్కా రామయ్య శతవసంతాలు పూర్తి చేయాలని సుధాకర్‌రెడ్డి అన్నారు. తనకు జరిగిన జన్మదిన సన్మానానికి అభినందనలతో చుక్కా రామయ్య మాట్లాడుతూ నిజాం పాలనలలో జమీందారులను, అప్పటి అధికారులను బాంచన్ అనే కాలం నుండి ఈనాటి వరకు పేదవారిలో ఎన్నో బాధలు, కష్టాలు చూసాను. చదువుకోవడానికి బడికి వచ్చి విద్యకు బదులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న పిల్లల్ని చూసానని, 1969లో ఆనాటి తెలంగాణ పోరాటంలో మారణ హోమాలు జరిగాయి అందుకే శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలని, నిరాహారదీక్షలతో, ఎంతోమంది ఆత్మహత్యలతో తెలంగాణ వచ్చిందని చుక్కా రామయ్య అన్నారు. చదువుపై శ్రద్ధ కలగని పిల్లలకు వందేమాతరం సంస్థ ప్రయోగాత్మకంగా ఆటపాటలతో విద్య నేర్పించిన విషయాలను గుర్తు చేశారు. ‘ఉద్యమంతో ప్రజలను రెచ్చగొట్టవద్దు..’ అని కొండా లక్ష్మణ్ బాపూజి మాటలను గుర్తు చేశారు. దేశం కోసం త్యాగాలు చేసేవారున్నారు కానీ ప్రోత్సహించేవారు లేరు. ఆంధ్ర, తెలంగాణ అనే ప్రాంతీయ బేధాలు వద్దని, ఎంతోమంది త్యాగధనులను చూసానని, వారి బాటలో నడుస్తూ చివరి క్షణం వరకు జనం కోసం బతుకుతూ జనంలోనే మరణిస్తానని చుక్కా రామయ్య అన్నారు. మల్లేపల్లి లక్ష్మయ్య అధ్యక్షత వహించిన కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరావు, చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి, తదితర అభిమానులు చుక్కా రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.