S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘మరో’యత్నం

హైదరాబాద్, నవంబర్ 20: జనవాసాల మధ్య నెలకొల్పిన భోలక్‌పూర్ తోళ్ల పరిశ్రమల వల్ల తాగునీరు కలుషితమై గతంలో పధ్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగిన పదేళ్లు గడుస్తున్నా, ఇంకా ఆ పరిశ్రమలను అక్కడి నుంచి తరలించలేదు. ప్రజలకు మెరుగైన వౌలిక వసతుల కల్పన, ప్రజారోగ్య పరిరక్షణకు పాలకులు చేస్తున్న కృషికి ఇది నిదర్శనమని చెప్పవచ్చు. కలుషిత నీటి కాటుకు 14 మంది ప్రాణాలు కోల్పోయినపుడు విచారణ నిమిత్తం నీతూప్రసాద్ కమిటీ వీటిని వెంటనే తరలించాల్సిన అవసరముందని సిఫార్సులు చేసినా, వీటిని వెంటనే ఇక్కడి నుంచి జనవాసాలకు దూరంగా తరలించాలని లోకాయుక్త, మానవ హక్కుల కమీషన్ ప్రభుత్వాన్ని ఆదేశించినా, ఏళ్లు గడుస్తున్నా, ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వ ప్రయత్నం ఫలించకపోవటం వివిధ శాఖల పనితీరుకు నిదర్శనం. ఈ క్రమంలో వీటిని వీలైనంత త్వరగా తరలించాలని ఇటీవలే హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్ జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన జిహెచ్‌ఎంసి కమిషనర్ సూచించారు. కొన్ని రాజకీయ పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ పరిశ్రమల తరలింపు సాధ్యం కావటం లేదు. ఈ క్రమంలో మరోసారి వివిధ ప్రభుత్వ శాఖలు ‘మరో’ యత్నం చేసేందుకు సిద్దమవుతున్నాయి. ఈ విషయంపై ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకునేందుకు త్వరలోనే చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ వద్ధ ఓ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. కానీ భోలక్‌పూర్‌లోనున్న మొత్తం 107 తోళ్ల పరిశ్రమలు, 183 ఇనుము, ప్లాస్టిక్ స్క్రాప్ దుకాణాలు, 123 ప్లాస్టిక్ స్క్రాప్, 120 ఐరన్ స్క్రాప్ దుకాణాలతో కలిపి మొత్తం 533 వరకు పరిశ్రమలున్నాయి. ఇక్కడున్న తోళ్ల పరిశ్రమలు తోళ్లను శుద్ది చేసేందుకు ప్రాణాంతకమైన రసాయనాలను వినియోగించటం, వాటిని శుద్ది చేసిన నీటిని నాలాల్లోకి వదలటం వల్ల నాలాల మధ్యలో నుంచి ఉన్న వాటర్ పైప్‌లైన్లలోకి ఈ రసాయం చేరి, తాగునీరు కలుషితమవుతోంది. అంతేగాక, ప్లాస్టిక్ వ్యర్థాల దుకాణాల్లో అగ్నిప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఓ బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన కూడా ఉంది.
ఏ పరిశ్రమలు ఎక్కడకు
భోలక్‌పూర్ ప్రాంతంలో ఉన్న 533 పరిశ్రమల్లో తోళ్లను శుద్ధి చేసే పరిశ్రమలను చెంగిచెర్లకు, ప్లాస్టిక్ పరిశ్రమలను మెడ్చల్ జిల్లాలోని ఏదులాబాద్‌కు తరలించాలన్నది సర్కారు ఆదేశం. కానీ అక్కడకు వెళితే సిటీలో బాగా గిరాకీ ఉన్న ఈ పరిశ్రమల నిర్వాహకులకు రవాణా భారంగా మారే అవకాశముండటంతో కొందరు పరిశ్రమల నిర్వాహకులు ససేమిరా అంటున్నారు. దీనికి తోడు ఇదే ప్రాంతంలో నివసిస్తున్న వారిని ప్రస్తుతం ఖాళీగా ఉన్న జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్లను కేటాయించాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ తాజాగా ఆదేశాలు జారీ చేశరా. చెంగిచెర్ల, ఇతర ప్రాంతాల్లో వధించిన జంతువుల తోళ్లను భోలక్‌పూర్ తీసుకువచ్చి ప్రాసెస్ చేయటం వల్ల నీరు కలుషితం అవుతుందన్న విషయాన్ని గుర్తించి వీటిని వీలైనంత త్వరగా తరలించాలని కమిషనర్ సూచించారు.