S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హైటెక్ సిటిలో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్,

గచ్చిబౌలి, నవంబర్ 20: హైటెక్ సిటీ పరిసరాలలో నిబంధనలకు విరుద్ధంగా రాత్రి సమయంలో నడుపుతున్న టిప్పర్లు, లారీలపై దృష్టి సారించారు. పెద్దపెద్ద బండరాళ్ల తరలించే సమయంలో లారీలకు సంబంధించిన వెనుక డొరు వేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు చాలా జరగడంతో అనేక ఫిర్యాదులు రావడంతో పాటు ఉన్నతాధికారులు దృష్టిపెట్టారు. శనివారం రాత్రి మాదాపూర్ ట్రాఫిక్ సబ్ డివిజన్ పోలీసులు ప్రత్యేక దాడులు చేశారు. విప్రో చౌరస్తా, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మైండ్ స్పేస్ జంక్షన్, ఖాజగూడ చౌరస్తా ప్రాంతాలలో పోలీసు వాహనాలను తనిఖీ చేశారు. వెనుక డోర్ లేకుండా నడుపుతున్న వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 30 టిప్పర్లకు ఫైన్ వేశారు, 10టిప్పర్లను సీజ్ చేసినట్టు మాదాపూర్ ట్రాఫిక్ సిఐ నర్సింగరావు తెలిపారు. సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎఆర్ శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ చేసినట్టు ఆయన తెలిపారు. పలుమార్లు టిప్పర్లకు డోర్ లేకుండా బండరాళ్లను తరలించడం వలన రాళ్ళు కింద పడి ప్రమాదాలు జరుగుతున్నాయని యజమానులకు సూచించినట్టు చెప్పారు. అయినా పోలీసుల ఆదేశాలను పట్టించుకోవడం లేదని తొందరగా పని అవుతుందనే ఆలోచనతో వాహనాల డోర్లు తోలగిస్తున్నారని చెప్పారు. వాటర్ ట్యాంకులపైన కూడా డ్రైవ్ చేపట్టనున్నామని, వారు కూడా నిబంధనలు పాటించాలని హెచ్చరించారు. మంచినీటి ట్యాంకర్లను నింపుకుని వస్తున్నారని దీనిలో రోడ్డు ఎత్తు పల్లాలున్న చోట నీరు రోడ్లపై పడి రోడ్లు పాడైపోతున్నాయని తెలిపారు. పోలీసుల ఆదేశాలు అమలు చేయకుండా వాహనాలు నడిపేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. నిబంధనలు పాటిస్తు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈకార్యక్రమంలో మాదాపూర్, మియాపూర్, కూక్కట్‌పల్లి ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.