S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పెరగనున్న చిల్లర కష్టాలు

హైదరాబాద్, నవంబర్ 20: ఉద్యోగం ఏదైనా, ఏ స్థాయిదైనా..చేసే పని ఏదైనా..మామూలు కార్మికుడైనా, పెద్ద అధికారి అయినా.. అందరూ ఎదురుచూసేది నెల జీతం కోసమే. గతంలో జీతం వచ్చిందంటే చాలు ఆ రోజు పండగే. కానీ ప్రస్తుతం కేంద్రం పెద్ద నోట్లపై విధించిన రద్దు కారణంగా జమ, విత్‌డ్రాలకు ఎదుర్కొంటున్న కష్టాలు..చిల్లర తిప్పలు ఇలాగే కొనసాగితే ఈ నెలాఖరు తర్వాత వచ్చే జీతాలకు జనాలు భయపడాల్సిన పరిస్థితి తలెత్తనుంది. నల్లధనాన్ని బయటకు తీయటం, నకిలీ కరెన్సీకి బ్రేక్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన పెద్ద నోట్ల రద్దుతో వచ్చే నెలా ఒకటో తేదీ తర్వాత మరిన్ని కష్టాలు పెరగనున్నాయి. ఈ నెల 8వ తేదీ రాత్రి వెయ్యి, 500 కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ఆగమేగాలపై ప్రకటన చేసిన ప్రభుత్వం ప్రజలకెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రెండు,మూడు రోజుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పినా, నేటికీ నగదు, మార్పిడి చిల్లర కోసం జనం పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఇప్పటికే బ్యాంకు ఖాతాల్లో డబ్బు పుష్కలంగా ఉన్నా, ఏటిఎంల ద్వారా రోజుకి కేవలం 2వేలకు మించి డ్రా చేసుకోని పరిస్థితి. అదే 2వేల నోటుకు ఎక్కడ కూడా చిల్లర దొరక్క జనం బేజారవుతున్నారు. ఈ కష్టాలిలా ఉండగా, వచ్చే నెల ప్రారంభం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు చిన్నాచితక పనులు, ఉద్యోగాలు చేసుకునే వారికి ఒకటో తేదీ 10వ తేదీ వరకు జీతాలు వస్తాయి. చిన్న చితక షాపు మొదలుకుని కార్పొరేట్ సంస్థల వరకు, అలాగే మామూలు స్వీపర్ మొదలుకుని ఉన్నతాధికారుల వరకు అందరికీ జీతాలు ఆన్‌లైన్‌లోనే రానున్నాయి. ఆయా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, వ్యాపార సంస్థలు కూడా ఇప్పటికే బ్యాంకుల్లో నిల్వ ఉన్న తమ నగదు నుంచి ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికుల ఖాతాల్లోకి నేరుగా ఆన్‌లైన్‌లో జీతాలు వచ్చి పడుతాయి. ప్రస్తుతం విత్‌డ్రాలు, నగదు మార్పిడికున్న కష్టాలు ఇలాగే కొనసాగితే కనీసం జీతాలను డ్రా చేసుకునేందుకు కూడా అనుకూలమైన పరిస్థితులుండవు. వాటిని డ్రా చేసుకునేందుకు ఎన్ని కష్టాలు పడాలో తల్చుకుంటేనే గుండే గుబేల్‌మంటోందని కొందరు ఉద్యోగులు, కార్మికులు వ్యాఖ్యానిస్తున్నారు. వేలల్లో, లక్షల్లో జీతాలు ఖాతాల్లో జమ అయ్యే అవకాశమున్నా, కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు ఇలాగే కొనసాగితే రోజుకి రెండువేలు డ్రా చేసి, ఆ నోటుకు ఎక్కడ చిల్లర తీసుకోవాలో, చిల్లర దొరికితే అందులో ఎంత వరకు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలన్న ఆందోళన ఇప్పటి నుంచే ఉద్యోగులను వేధిస్తోంది. సాధారణంగా నెలసరి జీతం రాగానే ప్రతి ఉద్యోగి ఇంట్లోకి కావల్సిన అన్ని రకాల నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటాడు. కానీ పెద్దనోట్ల రద్దు కారణంగా విత్‌డ్రాపై విధించిన పరిమితి ఇలాగే కొనసాగితే రెండురోజులకో సారి 2వేలు డ్రా చేసి అప్పటికపుడు అవసరమైన వస్తువులు తెచ్చుకునే పరిస్థితి రానుంది. లేదంటే ప్రతి డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే ప్రతిలావాదేవీకి రెండు శాతం అదనంగా చెల్లించుకోవల్సిందే!