S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పెరుగుతున్న చలి

హైదరాబాద్, నవంబర్ 20: నగరంలో రోజురోజుకి రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతూ, చలి ప్రభావం పెరుగుతోంది. వాతావరణం చల్లబడుతున్న కొద్దీ స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రబలుతుందేమోనన్న భయం నెలకొంది. గత రెండు సంవత్సరాల నుంచి వాతావరణం చల్లబడినపుడే స్వైన్‌ఫ్లూ వ్యాధి విజృంభించి గత సంవత్సరం కొందరు ప్రాణాలు కొల్పోయినా, కనీసం ఈ సారైనా వ్యాధి ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టడంలో సంబంధిత జిల్లా వైద్యారోగ్యశాఖ విఫలమైందని చెప్పవచ్చు. గతంలో కన్నా పోల్చితే రాత్రిపూట నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గి, కొన్ని సందర్భాల్లో కేవలం 12 డిగ్రీల వరకు నమోదైనన సందర్భాలుండటం, మున్మందు చలి ఇంకా పెరిగే అవకాశాలున్నాయన్న అంచనాలుండటంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాత్రి ఏడు గంటల నుంచే చల్లటి గాలులు వీస్తున్నాయి. ఇక రాత్రి పది గంటల తర్వాత బయటకు రావాలంటే స్వెట్టర్లు, శాలువలు వంటివి తప్పనిసరైపోయాయి. ఇక ఇప్పటికే పూర్తిగా రోడ్లు పూర్తిగా గుంతలమయం కావటంతో దుమ్ము,దూళి ఎగిరిపడుతుండటంతో వాహనదారులు మాస్కులు ధరిస్తున్నారు. ఇక సాయంత్రం నుంచి చల్లటి గాలులు వీయటంతో మాస్కులకు తోడు స్వెట్టర్లు, జర్కిన్‌లను ధరిస్తున్నారు. చలి తీవ్రత పెరుగుతుండటంతో రాత్రి పదిన్నర, పదకొండు గంటల తర్వాత బిజీ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. తెల్లవారిన తర్వాత ఎడున్నర, ఎనిమిది గంటల వరకు కూడా వాతావరణం చల్లగానే ఉండటంతో వాకింగ్, జాగింగ్ కోసం వచ్చే వారు కాస్త ఆలస్యంగా పార్కులకు వస్తున్నారు. వీరిలో మధుమేహాం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు కల్గిన వారు ఎనిమిది గంటల తర్వాతే పార్కుల్లోకి వస్తున్నారు. ఇప్పటికే స్వైన్‌ఫ్లూ అనుమానిత జలుబు, తీవ్ర జ్వరం వంటి లక్షణాలతో అనేక మంది బాధపడుతున్నారు. వీరిలో కొందరు తరుచూ నల్లకుంట ఫీవర్ ఆసుప్రతిని ఆశ్రయిస్తున్నారు. మరికొందరు ప్రైవేటు క్లీనిక్‌లలోనే చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు, వృద్దులకు, అలాగే మధుమేహాం, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడిన వారికి ఈ వ్యాధి చాలా త్వరగా సోకే అవకాశాలున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వాతావరణం చల్లబడినపుడు స్వల్ప జాగ్రత్తలు వహిస్తే వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.