S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గులాంనబీ ఆజాద్ దిష్టిబొమ్మ దగ్ధం

బాన్సువాడ, నవంబర్ 20: యురీలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలర్పించిన వీర సైనికుల త్యాగాలను కించపర్చే రీతిలో వ్యాఖ్యానాలు చేశారంటూ బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం బాన్సువాడ పట్టణంలో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ దిష్టిబొమ్మకు నిప్పంటించి దగ్ధం చేశారు. గులాంనబీ ఆజాద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ, దేశ రక్షణ కోసం అహరహం పాటుపడుతూ ప్రాణాలర్పించిన వీర సైనికులను అవమానించే రీతిలో గులాంనబీ ఆజాద్ పార్లమెంటులో వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, సైనికుల పట్ల ఆయనకు ఏపాటి గౌరవం ఉందో ఈ వ్యాఖ్యలు తేటతెల్లం చేశాయన్నారు. తక్షణమే ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శి అర్సపల్లి సాయిరెడ్డి, బాన్సువాడ మండల అధ్యక్షుడు శంకర్‌గౌడ్, నాయకులు శ్రీనివాస్, రీతూసింగ్, రాజ్‌సింగ్,వినోద్ తదితరులు పాల్గొన్నారు.

ఇష్టంగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి
మున్సిపల్ చైర్‌పర్సన్ స్వాతిసింగ్
ఆర్మూర్, నవంబర్ 20: ఇష్టంతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ స్వాతిసింగ్ అన్నారు. ఆదివారం ఆర్మూర్ పట్టణంలోని పాతబస్టాండ్ సమీపంలో గల శాఖ గ్రంథాలయంలో 49వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశంలో ఆమె పాల్గొని విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రమశిక్షణతో కష్టపడితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని అన్నారు. పోటీ వాతావరణంలో విద్యార్థులు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని ఆమె సూచించారు. వ్యాస రచన(తెలుగు మీడియం) పోటీల్లో ప్రథమ శ్రీనిజ, ద్వితీయ బి.అక్షయ్ కుమార్, తృతీయ సందీప్, ప్రోత్సాహక బహుమతి జైత్ర, ఇంగ్లీష్ మీడియంలో ఆశ కిరాడ్ ప్రథమ, గడ్డం సరిత ద్వితీయ, బొడ్డు అభిజ్ఞ తృతీయ, పి కార్తిక్ ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు. చిత్రలేఖనంలో జూనియర్ విభాగంలో ప్రథమ కె.అవినాష్, ద్వితీయ కె.ప్రణీత, తృతీయ జి.శ్రీవాణి, ప్రోత్సాహక కె.జిష్ణు, చిత్రలేఖనం సీనియర్స్‌లోప్రథమ బద్రీ ప్రసాద్, ద్వితీయ కె.రక్షిత, తృతీయ జి.గంగాధర్, జనరల్ నాలెడ్జ్‌లో ప్రథమ రమ్య, ద్వితీయ బి.్భర్గవి, తృతీయ కొక్కుల రక్షిత, ప్రోత్సాహక డి.వంశీ, రంగోళి పోటీల్లో ప్రథమ బహుమతులను అందుకున్నారు.