S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి

ఎల్లారెడ్డి, నవంబర్ 20: ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఎస్టీ వసతిగృహాల్లో ఉంటూ చదువుకుంటున్న పదవ తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కామారెడ్డి జిల్లా డిటిడిఓ ( జిల్లా గిరిజన వసతిగృహాల సంక్షేమాధికారి ) జి.గంగాధర్ అన్నారు. శనివారం రాత్రి ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని ఎస్టీబాలుర వసతిగృహానికి రాత్రి బసకోసం వచ్చారు. ఈసంధర్భంగా వసతిగృహంలోని రికార్డులను, విద్యార్థుల హాజరు శాతంను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతోకలిసి బోజనం చేశారు. అంతకు ముందు వంటగదిని పరిశీలించి, వంట మెనూప్రకారం వండటం పట్ల సంతృప్తివ్యక్తం చేశారు. బోజనం అనంతరం విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన రాత్రి విలేఖరులతోమాట్లాడారు. నూతనంగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా డిటిడిఓగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి సారిగా ఎల్లారెడ్డి ఎస్టీవసతిగృహంలో హస్టల్ నిద్రకోసం ఎంపిక చేసుకుని వచ్చానని తెలిపారు. జిల్లాలోమొత్తం 11 ఎస్టీ వసతి గృహాలున్నాయన్నారు. వీటిలో6 బాలుర, 1 బాలికల వసతిగృహం, 4 జూనియర్ కళాశాలల వసతిగృహాలు ఉన్నాయన్నారు, కామారెడ్డిలో2, బాన్స్‌వాడలో2 ఉన్నాయన్నారు. జిల్లాలోని 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వసతిగృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య 1,045 మంది విద్యార్థులు ఉన్నారని, వీరి ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుందన్నారు. కళాశాల విద్యార్థులకు ఎంటిఎఫ్ ద్వారా వచ్చే ఫీజులతోనడుస్తాయని అన్నారు. జిల్లాలోని 7 ఎస్టీ వసతిగృహాల్లో 115 మంది పదవ తరగతి విద్యార్థులు చదువుతున్నారన్నారు. పదిలోవంద శాతం ఉత్తీర్ణత సాధించేందు కోసం ట్యూటర్‌లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వసతిగృహంలోవిద్యార్థులకు కల్పిస్తున్న వౌళిక వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వసతి గృహం భవనం శిధిలావస్థకు చేరుకుందని, ఈవిషయమై భవనం డిస్‌మెంటల్ చేసి నూతన భవనం నిర్మాణం కోసం కోటి రూపాయలకు పైగా నిధులు సైతం మంజూరుగా, ఫిబ్రవరి నెలలోటెండర్‌లు కూడా పూర్తిఅయ్యాయని, ఈలోగా జిల్లాల పునర్విభజన జరిగిందని వసతి గృహ వార్డెన్ రామకృష్ణ డిటిడిఓ దృష్టికి తీసుకు వచ్చారు. ఈవిషయమై భవన నిర్మాణం కోసం తన వంతు కృషి చేయడం జరుగుతోందన్నారు.