S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నోట్ల రద్దుతో ఆర్టీసీకి అపార నష్టం

కంఠేశ్వర్, నవంబర్ 20: నిజామాబాద్ రీజియన్ పరిధిలో ఆయా జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ప్రతిరోజు ఆర్టీసీ సంస్థ 600పైచిలుకు బస్సు సర్వీసులు నడిపిస్తూ లక్షా 70వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం కొనసాగిస్తున్నారు. అనునిత్యం ఈ జిల్లా నుండి ఇతర రాష్ట్రాలకు, సుదూర ప్రాంతాలకు సుమారు 56వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. జిల్లాలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్-1, 2డిపోలతో పాటు కామారెడ్డిలోని కామారెడ్డి, బాన్సువాడ డిపోల నుండి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రయాణికులను వారివారి గమ్యస్థానాలకు ఆర్టీసీ బస్సులు చేరవేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం 500, 1000రూపాయల పాత నోట్లను రద్దు చేసిన నాటి నుండి గడిచిన పది పనె్నండు రోజులుగా ఆర్టీసీ సంస్థ పెద్దఎత్తున ఆదాయాన్ని కోల్పోతోంది. ఒక్క నిజామాబాద్ జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలోనే రోజుకు సుమారు 3లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లుతున్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో కష్టాల్లో కూరుకుపోయిన ప్రజలు తమ ప్రయాణాలను మానుకోవడంతో ఆర్టీసీకి ఈ పరిణామం శరాఘాతంలా మారింది. అత్యవసర పని ఉంటే తప్ప ప్రజలు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించడం లేదు. దీంతో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. అసలే జిల్లాల పునర్ విభజనతో ఒకింత కష్టాలను ఎదుర్కొంటున్న ఆర్టీసీ సంస్థపై ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మరింత పెనుభారంలా మారిందని అధికారులు, ఆర్టీసీ సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన తమ సంస్థ, నోట్ల రద్దు నిర్ణయంతో మరింత కుదేలుగా మారిందని, సమీప భవిష్యత్తులో కోలుకునే అవకాశాలు దరిదాపుల్లో కనిపించడం లేదని వారు వాపోతున్నారు. వాస్తవంగానే నోట్ల మార్పిడి, చిల్లర కష్టాల్లో నిమగ్నమై ఉన్న సామాన్య ప్రజానీకం యావత్తు వాటిని మార్పిడి చేసుకునేందుకు, డబ్బులను డ్రా చేసుకునేందుకు అనునిత్యం బ్యాంకులు, ఎటిఎంలు, పోస్ట్ఫాసుల వద్దనే క్యూలలో నిలబడుతున్నారు. ఎక్కడ చూసినా బ్యాంకుల వద్ద చాంతాడంత క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయాలనే ధ్యాస కూడా వారికి రావడం లేదని తెలుస్తోంది. ఆర్టీసీ బస్సులలో పాత 500, 1000రూపాయల నోట్లు చెల్లుతాయని, పాత కరెన్సీతో ప్రయాణాలు చేయవచ్చని ఆ సంస్థ ఉన్నతాధికారులు పేర్కొన్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి వేరేవిధంగా ఉంది. కొన్ని బస్సులలో మాత్రమే సిబ్బంది పాత నోట్లను స్వీకరిస్తుండగా, మెజార్టీ బస్సులలో తిరస్కరిస్తున్నారు. దీంతో ప్రయాణికులకు, సిబ్బంది మధ్య వాగ్వాదం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ పాత 500, 1000రూపాయల కరెన్సీ నోట్లనే తీసుకువస్తే అందరికీ తామెలా చిల్లరను సర్దుబాటు చేయాలని కండక్టర్లు, టిమ్స్ మెషిన్‌లను ఆపరేట్ చేసే డ్రైవర్లు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. కావాలనే కొంతమంది పాత నోట్లను మార్పిడి చేసుకునేందుకు ఆర్టీసీ బస్సులు ఎక్కుతూ మొదటి స్టేజీకే టిక్కెట్లు తీసుకుంటున్నారని, అలాంటప్పుడు తాము సంచి నిండా చిల్లర సమకూర్చుకుని తీసుకెళ్లినా అందరికీ సర్దుబాటు చేయడం సరిపడదని పేర్కొంటున్నారు. దీంతో చాలామంది పాత నోట్లను నిరాకరిస్తున్నారు. ఎవరైనా ప్రయాణికులు వాగ్వాదానికి దిగితే బస్సులలో ‘టిక్కెట్టుకు సరిపడా చిల్లర ఇవ్వండి’ అని రాసి ఉన్న నినాదాలను చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల వద్ద ప్రయాణికులు కూడా చేతిలో చిల్లర లేక ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు.