S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మేడిగడ్డ నిర్వాసితులందరికి న్యాయం చేస్తాం

గోదావరిఖని, నవంబర్ 20: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేయబోతున్న కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్‌కు సంబంధించి పంప్ హౌస్ నిర్వాసితులందరికి సంపూర్ణ న్యాయం చేస్తానని పెద్దపల్లి ఆర్డీ ఓ అశోక్ కుమార్ తెలిపారు. ఆదివారం అంతర్గాం తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా మేడిగడ్డ ప్రాజెక్ట్‌కు చెందిన గోలివాడ పంప్ హౌస్‌లో భూములు కొల్పోతున్న రైతులకు పెద్దపల్లి ఆర్డీ ఓ అశోక్ కుమార్ నష్టపరిహారం చెక్కులను అందజేశారు. 288 ఎకరాలు మొత్తంగా పంప్ హౌస్‌లో ముంపుకు గురవుతుండగా ముందుగా సుమారు 90 ఎకరాల భూమిని అప్పజెప్పేందుకు రైతులు సిద్ధమయ్యారు. పట్టా భూమికి సంబంధించి 40 ఎకరాల 34గుంటల భూమిని పట్టాదారులు ఎకరాన 8లక్షల రూపాయల చొప్పన మొత్తం 3,27,39,624 రూపాయల నష్టపరిహారం పొందారు. కాగా రిజిస్ట్రేషన్ కూడా పూర్తి కావడంతో ఆర్డీఓ వారికి ఒప్పందం మేరకు చెక్కులను అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంప్ హౌస్‌లో భూములు కొల్పోతున్న రైతులు అనవసరంగా దళారులను నమ్మి మోస పోవద్దని సూచించారు. కార్యక్రమంలో మేడిగడ్డ ప్రాజెక్ట్ సిఇ నల్లా వెంకటేశ్వర్లు, అంతర్గాం తహశీల్దార్ సతీస్ కుమార్, ఇఇ విష్ణుతోపాటు అధికారులు, రైతులు, గ్రామ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్ ధర్మయుద్ధ పోస్టర్ ఆవిష్కరణ
కాల్వశ్రీరాంపూర్, నవంబర్ 20: ఈ నెల 27న ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టే మాదిగ, ఉపకులాల ధర్మయుద్ధం కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండులో నిర్వహించనున్నట్లు నాయకులు అక్కపాక తిరుపతి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లులను ప్రవేశపెట్టాలని, దీనికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్ధతు తెలుపాలని డిమాంఢ్ చేశారు. రాజేందర్, శ్రీనివాస్, రామస్వామి, సతీష్, ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
సుల్తానాబాద్, నవంబర్ 20: సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామ పరిధిలోని శాస్త్రెనగర్‌కు చెందిన పెగడ రామస్వామి (55) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో శనివారం రాత్రి తీవ్ర గాయాలకు గురై చికిత్సపొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ బి.జీవన్ ఆదివారం తెలిపారు. రామస్వామి హోటళ్లో పనిచేస్తూ జీవించేవాడని, రోడ్డు దాటుతుండగా కరీంనగర్ నుండి పెద్దపల్లి వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురైన రామస్వామిని ఎస్‌ఐ బి.జీవన్ తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్‌ఐ తెలిపారు. ద్విచహాహనదారుడు రవీందర్‌కు గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.