S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఎలిగేడు, నవంబర్ 20: వైట్‌స్కాలర్ నేరాల పట్ల ప్రజలు అప్రమ్తంగా ఉండాలని జూలపల్లి ఎస్‌ఐ దేవేందర్ అన్నా రు. ఆదివారం మండలంలోని నర్సాపూర్‌లో జనమైత్రి పోలీస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ గుడుంబా అమ్మినా, బెల్టు షాపులు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కన్పించినా స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాసూరి దేవపాల, ఎంపిటిసి కాంపెల్లి విజయ, ఉపసర్పంచ్ వెంకటేష్ గౌడ్, పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

ఎలిగేడులో స్థల పరిశీలన
ఎలిగేడు, నవంబర్ 20: మండల కేంద్రంలోని రాజయ్యదొరపల్లి జడ్పీ రోడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఆల యం వరకు 10.25 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించనున్న ఫార్మేషన్ రోడ్ కోసం స్థలాన్ని సర్పంచ్ మండిగ రాజనర్సయ్య ఆదివారం పరిశీలించారు. అలాగే ఎలిగేడు ఆర్ అండ్ బి రోడ్ నుంచి పోషమ్మ గుడి వరకు ఉపాధి హామీ నిధులు 2.15 లక్షల నిధులతో నిర్మించే ఫార్మేషన్ రోడ్ కోసం స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఉపసర్పంచ్ కోరుకంటి వెంకటేశ్వర్ రావు, ఫీల్డ్ అసిస్టెంట్ లంకదాసరి శంకర్ తదితరులు ఉన్నారు.

దర్మ రక్షణే లక్ష్యంగా సాగాలి
చొప్పదండి, నవంబర్ 20: హిందు ధర్మ రక్షణే లక్ష్యంగా ప్రతి ఒక్కరు ముందకు సాగాలని, అప్పుడే మన సంస్కృతిని కాపాడిన వారం అవుతామని పరమపూజ్య శ్రీ శివస్వామి పిలుపునిచ్చారు. ఈ మేరకు గోదావరి మహాహారతి కార్యక్రమంలో భాగంగా శ్రీ శైవక్షేత్రము శ్రీ కోటిలింగ మహాశైవక్షేత్రము- దర్మోరక్షితి రక్షితహ అంటు ఆదివారం కోటిలింగాల క్షేత్రంలో పూజలు నిర్వహించేందుకు వెలుతుండగా చొప్పదండిలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ మేరకు పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో, శంభుస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హిందు ధర్మ రక్షణకై తీసుకోవల్సిన విధి వాద్యానాలు, దాని వలన హిందు ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలో తెలిపారు. అయ్యప్ప ఆలయంలో ఆలయ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్ స్వామిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆరెల్లి చంద్రశేఖర్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి క్రిష్ణారెడ్డి, చేపూరి సత్యనారాయణ, కాపర్తి మల్లిఖార్జున్, పడకంటి కృష్ణ, పుల్యాల లక్ష్మారెడ్డి, మడుపు నరేందర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.