S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మహాసభను జయప్రదం చేయండి

ముకరంపుర (కరీంనగర్), నవంబర్ 20: తెలంగాణ బిల్డింగ్ వర్క ర్స్ యూనియన్ మహాసభ ఈ నెల 25న బద్ధం ఎల్లారెడ్డి భవన్‌లో జరుగుతుందని, దీనిని జయప్రదం చేయాలని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య పిలుపునిచ్చారు. ఆదివారం ఎఐటియుసి కార్యాలయంలో మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంఘటిత రంగంలో అతి కీలకమైన రంగం భవన నిర్మాణ రంగమని, ఈ కార్మికులకు నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, కార్మికుల అడ్డాల దగ్గర వసతులతో షెల్టర్ నిర్మించాలని, బిల్డర్స్ వద్ద పనిచేసే కార్మికులకు పని భద్రత కల్పించాలని, 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు నెలకు 3 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని, పిఎఫ్, ఇఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని కోరా రు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు కాలువ నర్సయ్య యాదవ్, తెలంగాణ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ బెక్కంటి రమేష్, కటికెరెడ్డి బుచ్చన్న యాదవ్, సత్యం, పైడిపెల్లి రాజు, కేదారి, దుడ్డెల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

టిడిపి హయాంలోనే అనిన వర్గాలకు రాజ్యాధికారం
కరీంనగర్ టౌన్, నవంబర్ 20: తెలుగుదేశం పార్టీ హయాంలోనే బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కిందని నగర తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కల్యాడపు ఆగయ్య అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదులో భాగంగా నగరంలోని 33వ డివిజన్‌లో కార్యవర్గ సభ్యులు కామారపు భూమయ్య ఆధ్వర్యంలో ఆదివారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆగయ్య మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారం చేపట్టిన తరువాతనే బడుగు, బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం వచ్చిందని అన్నారు. పరిపాలనలో పేద వర్గాల వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత ఎన్‌టిఆర్‌కే దక్కుతుందని అన్నారు. 35 సంవత్సరాల కాలంలో 18 సార్లు సభ్యత్వ నమోదు చేసిన పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. నగరంలో పార్టీ బలోపేతానికి అందరు కలిసికట్టుగా కృషి చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ‘సభ్య త్వ రుసుము వంద రూపాయలు చెల్లించి సభ్యత్వం పొందిన వారికి రెండు లక్షల రూపాయల జీవిత భీమా సౌకర్యం’ పార్టీ కల్పించిందని అన్నారు.