S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వీ(క్)కెండ్...!

కరీంనగర్, నవంబర్ 20: వీకెండ్ వీక్ అయిపోయింది. నాన్‌వేజ్ ప్రియులకు ముక్క తినడం గగనమైంది. ఆదివారం వచ్చిందంటే చాలు వీకెండ్ పార్టీలతో ఏంజాయ్ చేసే జనాలకు ఈ సండే జోష్ నింపలేదు. వీకెండ్‌లో కళకళలాడే మటన్, చికెన్, పిష్ తదితర మార్కె ట్లు జనాలు లేక బోసిపోయాయి. పెద్ద నోట్ల రద్దుతో వీకెండ్ పార్టీ (దవాత్)లు డీలా పడ్డాయి. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఆ నోట్లను మార్చుకునేందుకే నానాతిప్పలు పడుతున్న జనాలు వీకెండ్ పార్టీలపై దృష్టి సారించడం లేదు. ప్రస్తుత తరుణంలో ప్రతిపైసా అవసరమేగా అంటూ జనాలు కొత్త పల్లవి అం దుకున్నారు. నోట్ల రద్దుకు ముందు మాత్రం ఆదివారం వచ్చిదంటే చాలు మటన్, చికెన్, పిష్, మందు దుకాణాలు జనాలతో కిటకిటలాడేవి. ప్రస్తుతం దీనికి భిన్నంగా పరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లా కేంద్రాల్లోని ప్రధాన మటన్, పిష్, చికెన్ మార్కెట్‌లతో పాటు గల్లీగల్లీలో ఉండే చికెన్, మటన్ షాపుల వద్ద పదుల సంఖ్యలో జనాలు కన్పించేవారు. ఇప్పుడు ఒకరిద్దరు ఉండటం కూడా గగనమే అయింది. నోట్ల రద్దు నుంచి అమ్మకాలు తగ్గాయని నాన్‌వేజ్ దుకాణదారులు చెబుతున్నారు. వచ్చిన ఒకరిద్దరు కూడా రూ.2వేల నోట్లు తెస్తుండటంతో వాటికి చిల్లర లేక ఇబ్బందులు పడుతున్నామంటూ వాపోతున్నారు. పిష్ మార్కెట్‌లో చేపలను శుభ్రం చేసేవారికి పని లేకుండా పోయింది. ఆదివారమైతే చాలు మాకు తీరికలేకుండా పని ఉండేదని, అలాంటిది నోట్ల రద్దుతో చేపలు కొనేవారు, కడిగించుకునే వారు లేరంటూ చేపలు శుభ్రం చేసే వారు వాపోతున్నారు. ఇటు మటన్, చికెన్, ఫిష్ దుకాణాల వద్ద మందకొడిగా అమ్మకాలు కొనసాగుతుండగా, అటు కూరగాయల మార్కెట్‌లలో కూడా చిల్లర అందుబాటులో లేకపోవడంతో వారి వ్యాపారం కూడా డీలా అయింది. నాన్‌వేజ్ షాపులు, కూరగాయల మార్కెట్‌ల పరిస్థితి ఇలా ఉంటే..వైన్స్ షాపుల పరిస్థితి మాత్రం కొంత మెరుగ్గానే ఉంది. మద్యం దుకాణాల ముందు కొంతమేర మందు బాబులు కన్పిస్తున్నారు. నోట్ల రద్దుకు ముందు ఏ వైన్స్ ముందు చూసినా మద్యం ప్రియులు బారులు తీరేవారు కాగా, ప్రస్తుతం ఐదారుగురు చొప్పున కన్పిస్తున్నారు. నోట్ల రద్దుతో తమ దగ్గర ఉన్న ప్రతిపైసా కూడా అవసరంగానే మద్యం ప్రియులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బార్ అండ్ రెస్టారెంట్‌ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దీనికి పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా తోడయ్యాయి. రెస్టారెంట్‌లో మద్యం సేవించే జనాల సంఖ్య తగ్గిపోయింది. మొత్తానికి ఆదివారం వేళ మెజారిటీ ఇళ్లల్లో నాన్‌వేజ్ ఘుమఘుమలు ఉంటుండగా, తాజా పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ఇళ్లల్లో మాత్రమే ఆ ఘుమఘుమలు వెదజల్లగా, ప్రతిసారీ వీకెండ్‌లో ఏంజాయ్ చేసే జనాలు వారి వద్ద ఉన్న కొద్దిపాటి నోట్లను ఖర్చు చేసేందుకు వెనకడుగేస్తూ వీకెండ్ పార్టీలకు దూరంగా ఉండటం గమనార్హాం.