S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆక్రమ నిర్మాణాలపై రెవెన్యూ కొరడా

జగిత్యాల, నవంబర్ 20 మల్యాల మండలం నూకపల్లి ఇందిరమ్మ అర్బన్ కాలనీలో ఆక్రమంగా నిర్మించుకున్న ఇళ్లపై రెవెన్యూ అధికారులు ఆదివారం కొరఢా గులిపించారు. ఈ కూల్చివేతల్లో దాదాపు 548 ఇళ్లను రెవెన్యూ అధికారు లు బారీ బందోబస్తు మద్య కూల్చివేసారు. జగిత్యాల సబ్ కలెక్టర్ శశాంక నేతృత్వంలో 40 మంది రెవెన్యూ అధికారులు, 140 మంది పోలీసులు, అరుగురు గృహా నిర్మాణ శాఖ అధికారులు, జగిత్యాల డిఎస్పీ రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో అరుగురు సిఐల అధ్వర్యంలో ఈ కూల్చివేతలు కొనసాగాయి. ఇందిరమ్మ కాలనీలో ఆక్రమ నిర్మాణాల కూల్చివేత జిల్లాలో చర్చనీయంశంగా మారింది.
5వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు
అప్పటి వైఎస్ ప్రభుత్వం 173 ఎకరాల్లో నర్సింగాపూర్, నూకపల్లి అర్బన్ కాలనీలో జగిత్యాల పట్టణానికి చెందిన నిరుపేద కుటుంబాలకు పక్క ఇళ్లు నిర్మానించాలని 5 వేల 421 ఇళ్లతో కాలనీ ప్రారంభించి లాటరీ పద్దతిన ఇళ్ల స్థలాలను మంజూరు చేసారు. ఈక్రమంలోనే ఇందిరమ్మ బిల్లుల విడుదల్లో జాప్యం, దానికి తోడు లబ్దిదారుడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇళ్ల నిర్మాణంపై అసక్తి తగ్గడంతో నిరుపేదలకు మంజూరైన ఇళ్ల స్థలాలను విక్రయించుకున్నారు. ఇదే క్రమంలోనే నూకపల్లి అర్బన్ కాలనీలో ఆక్రమార్కులు పాగా వేసారని తరచూ ఫిర్యాదులు రావడంతో విచారించిన రెవెన్యూ అధికారులు అసలైన లబ్దిదారులను గుర్తించి ఆక్రమ నిర్మించుకున్న నిర్మాణాలను కూల్చివేసారు.
బాధ్యులపై క్రమినల్ చర్యలు జగిత్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ నాగేంద్ర
మల్యాల మండలం నూకపల్లి అర్బన్ కాలనీలో ఆక్రమంగా ఇళ్ల నిర్మించుకున్న వ్యక్తులతో పాటు దానికి ప్రోత్సహించిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టనున్నట్లు జగిత్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ నాగేంద్ర అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నూకపల్లి అర్బన్ కాలనీలో గతంలో పలువురు అధికారుల సంతకాలను ఫోర్జరి చేసి జారీ ప్రతాలు సృష్టించారని తెలిపారు. వాటిని విచారించగా కొంద దళారులు ఫోర్జరి చేసి ఇతరులకు విక్రయించినట్లు తేలిందన్నారు. వారిపై విచారించి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వివరించారు. కాగా అర్హుడైన లబ్దిదారుని ఎలాంటి సమస్య తలెత్తదని అన్నారు.

ఇది రైతు ప్రభుత్వం
హుస్నాబాద్, నవంబర్ 20: తెలంగాణ ఉద్యమంలో 2001నుండి నేటి వరకు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు టిఅర్‌ఎస్ పార్టీకి వెన్నంటి ఉంటున్నారని మీ అందరి సహకారంతో హస్నాబాద్‌ను సిద్దిపేట తరహలో అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తానని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు హామి ఇచ్చారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణంలో అర్యవైశ్య భవనంలో ఎర్పాటు చేసిన తెలంగాణ వికాస సమితి మహసభకు ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రజలు కావలసిన వౌళిక సదుపాయాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎదుర్కోటుంన్న సమస్యలను, వాటి పరిష్కారానికి తీసుకోవలసిన తదితర సూచనలు సలహలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్దికి తోడ్పడుతున్న తెలంగాణ వికాస సమితి సేవలు అభినందనీయమని అన్నారు.హుస్నాబాద్ మండలంలోని మహసముద్రం గండి విషయం ప్రభుత్వం దృష్టికి తెచ్చారని అన్నారు.ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు అడ్డు పడకుండ ప్రజలు సహకరించాలని కొరారు. ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేసి రైతులుకు సాగునీరు అందిచాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తుందన్నా రు. అనంతరం భూనిర్వసితులకు చెక్కులను 16 మంది రైతులకు 89.23 లక్షలు పంపీణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమారు, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగ రెడ్డి,టీవిస్ అధ్యక్షులు దేశపతిశ్రీనివాస్, రాష్త్ర అధ్యక్షులు ధామస్‌రెడ్డి, జెడ్పివైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, నగర చైర్మన్ చంద్రయ్య, లక్ష్మరెడ్డి, శ్రీహరి, సాయన్న, తన్నీరు శరత్ రావు, హుస్నాబాద్ పార్టీ అధ్యక్షులు తిరుపతి, కన్నోజు రామకృష్ణ పాల్గొన్నారు.