S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ముగిసిన ఎస్‌ఐ రాత పరీక్ష

కరీంనగర్, నవంబర్ 20: పోలీస్‌శాఖలోని వివిధ విభాగాల్లో స్ట్ఫైండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ (సివిల్/ఏఆర్/టిఎస్‌ఎస్పీ/ఎస్పీఎఫ్/ ఎస్‌ఏఆర్‌సిపిఎల్/ఎస్‌ఎఫ్‌ఓ) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా రెండు రోజుల పాటు నిర్వహించిన ఎస్‌ఐ రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. ఆదివారం పరీక్షకు మొత్తం 12,305 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 11,879 మంది హాజరై పరీక్ష రాసారు. 426 మంది అభ్యర్థులు గైర్హాజర్ అయ్యారు. ఎస్‌ఐ ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో ఉన్న ఓ బాలింత తన రెండు నెలల వయస్సు ఉన్న పాపతో రెండోరోజు పరీక్షకు కూడా హాజరైంది. భద్రాది జిల్లా కొత్తగూడెం టేకులపల్లి గ్రామానికి చెందిన సునీత ఎస్‌ఐ పరీక్ష రాసేందుకు తన రెండు నెలల పాప, ఆమె తల్లితో కలిసి పరీక్షా కేంద్రమైన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చేరుకోగా, పోలీసులు సునీతను పరీక్ష హాలులోకి అనుమతించగా, ఆమె తల్లిని పరీక్షా కేంద్రం ఆవరణలో ఉండేందుకు అనుమతించారు. దీంతో సునీత ప్రశాంతంగా పరీక్ష రాసింది. పరీక్ష రాసేందుకు మొత్తం 25కేంద్రాలను ఏర్పాటు చేయగా, జిల్లా కేంద్రంతోపాటు శివారులోని పలు విద్యా సంస్థల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30గంటల వరకు నిర్వహించారు. ధృవీకరణ పత్రాల పరిశీలన, బయోమెట్రిక్ ద్వారా తనిఖీల అనంతరమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. నిషేధిత వస్తువులను అనుమతించకపోగా, నిమిషం నిబంధనను అమలు చేశారు. దీంతో ఆలస్యంగా వచ్చిన కొందరు అభ్యర్థులు ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. పరీక్ష ముగిసే వరకు జిరాక్స్ సెంటర్‌లను మూసివేయించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 నిషేదాజ్ఞలు అమలు చేయగా, భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి పలు కేంద్రాలను సందర్శించారు. పరీక్షల అనంతరం ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలు చేపట్టారు. సిపి కమలాసన్‌రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో అడిషనల్ సిపి అన్నపూర్ణ, ఎసిపి రామారావులతోపాటు 500 మంది పోలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తు చర్యల్లో పాల్గొన్నారు.

మస్కట్‌లో ఘనంగా మహాలింగార్చన
చందుర్తి, నవంబర్ 20: కార్తీక మసాన్ని పురస్కరించుకొని మస్కట్‌లో తెలుగు ప్రాంతంలో అదివారం తెలుగు ప్రజలు మహాలింగార్చన ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండలానికి చెందిన పెద్దఎత్తున ప్రజలు ఉపాధినిమిత్తం మస్కట్ వెళ్లారు. ఈ సందర్భంగా మహాలింగార్చన కార్యక్రమాన్ని నిర్వహించి కార్తీక బోజనాల పండుగలను నిర్వహించారు. ఈ వెడుకల్లో పెద్దఎత్తున యువకులు, దంపతులు పాల్గొన్నారు. చందుర్తి పెంటయ్య, ప్రవాస భారతీయులు కట్కం రవి, రాజేశంతోపాటు ఎన్‌అర్‌ఐలు పాల్గొన్నారు.