S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మన్యం అభివృద్ధికి కృషి

సీతంపేట, నవంబర్ 20: సీతంపేట ఏజెన్సీలో మన్యం మండలాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ లక్ష్మీనృసింహం అన్నారు. ఆదివారం సీతంపేట ఏజెన్సీలో కలెక్టర్ కుటుంబ సభ్యులతో కలిసి పర్యటన జరిపారు. గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో మిర్చిగూడ జలపాతం అందాలను అభివృద్ధి చేసేందుకు రూ.70 లక్షల నిధులతో జరుగుతున్న నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. పర్యాటక ప్రాంతంగా ఈ ప్రదేశం సీతంపేట ఏజెన్సీకే తలమానికంగా నిలుస్తుందన్నారు. నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నందున గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ ఇ ఇ శ్రీనివాస్, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. అక్కడ నుంచి దోనుబాయికి వెళ్లే దారిలో చంద్రమ్మగుడి వద్ద అభివృద్ధి చేస్తున్న పర్యాటక ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. గుడి పక్క నుంచి కొండపైకి వెళ్లేందుకు మెట్లు నిర్మించాలని కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్‌తో పాటు జిల్లా కో- ఆప్షన్ సభ్యులు సవర తోటముఖలింగం, ఎంపిటిసి బిడ్డిక దమయంతినాయుడు, ఏఇ తిరుపతినాయుడు, సర్పంచ్ సూర్యారావు తదితరులున్నారు.